Extra Ordinary Man: ఓటీటీలో ఎక్స్ట్రాడినరీ మ్యాన్.. అదిరిపోతున్న రెస్పాన్స్

హీరో నితిన్ నటించిన లేటెస్ట్ చిత్రం ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఇప్పుడు ఈ సినిమా OTT ప్రేక్షకులను అలరిస్తోంది. జనవరి 19 నుంచి ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

Extra Ordinary Man: ఓటీటీలో ఎక్స్ట్రాడినరీ మ్యాన్.. అదిరిపోతున్న రెస్పాన్స్
New Update

Extra Ordinary Man: వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్, శ్రీలీల కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం ఎక్స్ట్రాడినరీ మ్యాన్. డిసెంబర్ 8 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించనంతగా ఆకట్టుకోలేకపోయింది. ట్రైలర్ అదిరిపోయేలా ఉన్నప్పటికీ సినిమా మాత్రం నిరాశ పరిచినట్లు రివ్యూస్ వచ్చాయి.

ఓటీటీ రెస్పాన్స్

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. జనవరి 19 ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ హాట్ స్టార్ లో రిలీజైన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. థియేటర్ ఆడియన్స్ ను అంతగా మెప్పించకపోయిన ఓటీటీలో మాత్రం దూసుకెళ్తుంది. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఎంటర్ టైన్మెంట్ ను ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సినిమాలో తండ్రి పాత్రలో రావు రమేష్ చేసిన హంగామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. నితిన్, రావు రమేష్ మధ్య కామెడీ టైమింగ్, శ్రీలీల డాన్స్ లు, అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఓటీటీలో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Also Read: Ranbir, Bobby Deol: రాముడిగా రణ్ బీర్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్.. మరో సారి కాంబో రిపీట్

publive-image

ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఎన్.సుధాక‌ర్ రెడ్డి నిర్మించారు. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చిత్రానికి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జయరాజ్ సంగీతం అందించారు. సీనియర్ నటుడు రాజశేఖర్ స్పెషల్ రోల్ లో నటించారు.

Also Read: Rashmika Deepfake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో నిందితుడిని.. అరెస్ట్ చేసిన పోలీసులు

#extra-ordinary-man-ott-response #extra-ordinary-man
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe