Anant-Radhika Pre Wedding: ఆరు పదుల వయస్సులోనూ తరగని అందం..కొడుకు ప్రీవెడ్డింగ్ లో నీతా అందానికి నెటిజన్లు ఫిదా.!

అనంత్ - రాధిక ప్రీ వెడ్డింగ్ లో అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఈవెంట్‌ ఫోటోలు,వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అనంత్ తల్లి,ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాజా వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రీవెడ్డింగ్ లో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Anant-Radhika Pre Wedding: ఆరు పదుల వయస్సులోనూ తరగని అందం..కొడుకు ప్రీవెడ్డింగ్ లో నీతా అందానికి నెటిజన్లు ఫిదా.!
New Update

Anant-Radhika Pre Wedding:  వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ భార్య,ధీరూభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. కొడుకు అనంత్ -రాధికల ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో అంబానీ ఫ్యామిలీ సందడి చేస్తోంది. శుక్రవారం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సమయంలో , నీతా అంబానీ తాజా వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో నీతా అంబానీ అందం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆరు పదుల వయస్సులోనూ ఎంత అందంగా ఉంది...నీతా అంబానీ ముందు బాలీవుడు హీరోయిన్ల అందం బలాదూర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమంలో నేడు రెండో రోజు. అంతకుముందు శుక్రవారం రాత్రి, అంబానీ కుటుంబానికి చెందిన ఈ ఈవెంట్‌లో చాలా సరదాగా జరిగింది. ఇందులో అంతర్జాతీయ, బాలీవుడ్ ప్రముఖులు చాలా సందడి చేశారు. అంతే కాదు అంబానీ ఫ్యామిలీ లుక్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది.

publive-image

అనంత్ తల్లి వ్యాపారవేత్త నీతా అంబానీకి సంబంధించిన తాజా వీడియో బయటకు వచ్చింది. దీనిని ఫిల్మిజ్ఞాన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో నీతా అందమైన రూపాన్ని చూస్తే మీరు ఫిదా అవుతారు. నీతా అంబానీ తన చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో వైట్ కలర్ వన్ షోల్డర్ సిల్క్ గౌను ధరించి తళుక్కుమంది. 60 ఏళ్ల వయసులో బాలీవుడ్ భామల కంటే నీతా రెండడుగులు ముందున్నట్లు కనిపిస్తోంది. అనంత్-రాధికల స్పెషల్ ప్రోగ్రామ్‌లో నీతా తన స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

publive-image

అనంత్ అంబానీ- కాబోయే భార్య రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు మార్చి 1 నుండి ప్రారంభం కాగా, అంబానీ కుటుంబం ఫిబ్రవరి 28 నుండి జామ్‌నగర్‌లో సందడి చేస్తోంది. ఈ జంట ఈ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్ మార్చి 3 వరకు అంటే రేపు వరకు కొనసాగుతాయి.


 ఇది కూడా చదవండి: ‘అనంత్‌ని చూసినప్పుడల్లా మా నాన్న ధీరూభాయ్ గుర్తొస్తాడు’ ముకేశ్ అంబానీ భావోద్వేగం..!

#mukesh-ambani #gujarath #neetha-ambani #mukesh-ambani-and-wife-nita #anant-radhika-pre-wedding #jam-nager
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe