Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌లో 'ఇండియా హౌస్‌'.. ప్రత్యేకతలు వివరించిన నీతా అంబానీ!

పారిస్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా ప్యారిస్ లో ఏర్పాటు చేసిన ‘ఇండియా హౌస్‌’ను నీతా అంబానీ ప్రారంభించారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటుచేశామన్నారు. ఇంటి ప్రత్యేకతలను పంచుకుంటూ వీడియోను విడుదల చేశారు.

New Update
Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌లో 'ఇండియా హౌస్‌'.. ప్రత్యేకతలు వివరించిన నీతా అంబానీ!

Nita Ambani: పారిస్‌ ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన భారత క్రీడాకారులకోసం పార్క్ డి లా విల్లెట్ దగ్గర ప్రత్యేకంగా ‘ఇండియా హౌస్‌’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌, అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ (IOC) సభ్యురాలు నీతా అంబానీ (Nita Ambani) దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటి ప్రత్యేకతలను పంచుకుంటూ వీడియోను విడుదల చేశారు.

‘ఈ క్రీడల్లో పోటీపడుతున్న మన అథ్లెట్ల కోసం తొలిసారిగా ఒలింపిక్స్‌ గ్రామంలో ఓ సొంత ఇల్లు ఏర్పాటు చేయబడింది. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటుచేశాం. మన అథ్లెట్లను సస్మానించడానికి, వారి విజయాలను సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఇది ఓ వేదిక. ఇక్కడ కశ్మీర్‌, బనారస్‌ నుంచి తీసుకొచ్చిన కళాకృతులు, హస్త కళలు, భారత సంప్రదాయ ఆభరణాలను ప్రదర్శిస్తున్నాం' అంటూ నీతా అంబానీ చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోలో కళాకారుల నృత్యాలకు నీతా కూడా కాలు కదిపి డ్యాన్స్‌ చేశారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులకు భారతీయ వంటకాలను రుచి చూపించారు.

Advertisment
తాజా కథనాలు