Nirmala Sitharaman: దేశంలో ఎల్ఫీజీ కనెక్షన్లు డబుల్ అయ్యాయి.. పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ 

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉందని చెప్పారు. మౌలిక సదుపాయాలకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆమె వివరించారు. 

BREAKING: 300 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం.. బడ్జెట్లో వరాల జల్లు
New Update

Nirmala Sitharaman: దేశీయ ఎల్పీజీ (LPG) కనెక్షన్లు 2014లో 14.5 కోట్లు ఉండగా, ఇప్పుడు 31.4 కోట్లకు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంటే గత తొమ్మిదేళ్లలో 16.9 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు పెరిగాయి. అదే సమయంలో, పిఎం కిసాన్ యోజన కింద 11 కోట్ల మంది లబ్ధిదారులకు సహాయం అందిస్తున్నట్లుగా ఆమె చెప్పారు.  పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఆర్థిక మంత్రి దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు.

నిర్మలా సీతారామన్ ప్రసంగంలోని ముఖ్య అంశాలు ఇవే..  

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందిందని , భారత్ రెండో త్రైమాసిక వృద్ధి (7.6%) ప్రపంచంలోనే అత్యధికమని ఆర్థిక మంత్రి Nirmala Sitharaman తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వేగాన్ని కొనసాగించామని ఆమె అనాన్రు. 

ప్రపంచంలోని మూడు, నాలుగో ఆర్థిక వ్యవస్థలు ఒకే త్రైమాసికంలో దెబ్బతినిపోయాయని..  జర్మనీ ఆర్థిక వ్యవస్థ 0.4 శాతం క్షీణించగా, జపాన్ ఆర్థిక వ్యవస్థ 2.1 శాతం క్షీణించిందని ఆమె తెలిపారు.  వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లో వియత్నాం 5.33%, మలేషియా 3.3%, థాయ్ లాండ్ 1.5% వృద్ధిని సాధించాయి. వాటికంటే భారత్ చాలా ముందుందని నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) ప్రకటించారు. 

2014 లో భారతదేశం 10 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, ఇది 8 సంవత్సరాలలో 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని ఆర్థిక మంత్రి అన్నారు. ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలు మంచి పనితీరు కనబరిచాయని చెప్పిన ఆమె  సేవా రంగంతో పాటు తయారీ రంగం కూడా జీడీపీకి దోహదపడుతోందని చెప్పారు. 

క్యూ2లో అత్యధికంగా 13.9 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా (Mobile Manufacture) భారత్ నిలిచిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ 10 బిలియన్ డాలర్లు అంటే సుమారు 83 వేల కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసింది. ప్యాసింజర్ వాహన ఎగుమతులు కూడా పెరిగాయని ఆమె వెల్లడించారు. 

మౌలిక సదుపాయాలకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సాధారణంగా భారత్ ను మెచ్చుకోని ప్రపంచ మీడియాలో ఇది ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా మీడియాలో ప్రచురితమైన ప్రకటనను ఆమె చదివి వినిపించారు.

చైనాను అధిగమించి భారత ఆర్థిక నమూనాను వినియోగం నుంచి ఉత్పాదక ఆధారిత నమూనాకు మార్చేందుకు ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలు మౌలిక సదుపాయాలు, భారీ పరిశ్రమల కంపెనీలకు అనుకూల పరిస్థితిని సృష్టిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించే వారి ఈ పరిశీలన భారతదేశ అభివృద్ధి గురించి చాలా చెబుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

పాలు, పప్పుధాన్యాలు, జనపనార, చక్కెర ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఇది కాకుండా, రియల్ టైమ్లో అత్యధిక డిజిటల్ చెల్లింపులు భారతదేశంలో జరుగుతున్నాయి.  అమెరికా సూపర్ మార్కెట్ కు భారత్ ఎగుమతులు 44 శాతం పెరగ్గా, చైనా ఎగుమతులు 10 శాతం తగ్గాయి అని ఆమె వివరించారు. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు కూడా పెరిగాయి. ఈ ఏడాది నవంబర్ 9 నాటికి ఇది రూ.10.60 లక్షల కోట్లకు పెరిగింది. వార్షిక ప్రాతిపదికన ఇది 21% పెరిగిందని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. 

Also Read: ఈ విజయానికి కార్యకర్తలే కారణం.. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ 

2014లో 14.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు (LPG Connections) ఉండగా, ఇప్పుడు 31.4 కోట్ల రాజీవ్ గాంధీ గ్రామీణ ఎల్పీజీ వితరణ యోజనలో 2014 జూన్ 1 నాటికి 5.82 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆ సమయంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ల కోసం డిపాజిట్ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం సిలిండర్ ఉచితం, కనెక్షన్ ఉచితం, డిపాజిట్ చేయాల్సిన అవసరం కూడా లేదని నిర్మలా సీతారామన్ వివరించారు. 

ఉజ్వల పథకాన్ని (Ujjwala Yojana) ప్రవేశపెట్టడంతో 2021 నాటికి 99.8% గృహాలు  కవర్ అయ్యాయి. ప్రస్తుతం ఉజ్వలలో 9.8 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. 2014లో ఉజ్వల సహా దేశీయ ఎల్పీజీ కనెక్షన్లు 14.5 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం 31.4 కోట్ల డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని ఆమె పార్లమెంట్ కు వివరించారు. 

Watch this interesting Video:

#parliament #nirmala-sitharaman
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe