Budget 2024 : బడ్జెట్‌ వేళ స్పెషల్‌ శారీలో నిర్మలమ్మ

బడ్జెట్‌ ను ప్రవేశపెట్టబోయే సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నీలం రంగు, క్రీము రంగు టస్సార్‌ చీరను ధరించి కార్యాలయానికి వచ్చారు. దీనిని తమిళంలో రామర్‌ బ్లూ అని కూడా అంటారు. ఇది ఉత్తర్‌ప్రదేశ్‌ లోని అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆమోదాన్ని సూచిస్తుంది.

New Update
Budget 2024 : బడ్జెట్‌ వేళ స్పెషల్‌ శారీలో నిర్మలమ్మ

Nirmala Sitharaman : యావత్‌ దేశం మొత్తం ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman)  ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌(Budget) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఎప్పటిలానే నిర్మలమ్మ బడ్జెట్‌ తో పార్లమెంట్‌ కు వచ్చారు. బడ్జెట్‌ ను ప్రవేశపెట్టబోయే సమయంలో ఆమె నీలం రంగు, క్రీము రంగు టస్సార్‌ చీరను ధరించి కార్యాలయానికి వచ్చారు. దీనిని తమిళంలో రామర్‌ బ్లూ అని కూడా అంటారు. ఇది ఉత్తర్‌ప్రదేశ్‌ లోని అయోధ్య(Ayodhya) లోని రామ మందిరం(Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ(Prana Pratishtha) వేడుకకు ఆమోదాన్ని సూచిస్తుంది.

గత సంవత్సరం నిర్మలమ్మ ఎరుపు రంగు నవలగుండ ఎంబ్రాయిడరీతో చేతితో నేసిన ఎరుపురంగు ఇల్కల్ చీరను ధరించి సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఏడాది చీర మల్బరీ సిల్క్‌ లో బెంగాల్‌ స్త్రీలు ధరించే చీరలాగా ఉంది. గత సంవత్సరం నిర్మలమ్మ కర్నాటక(Karnataka) లోని ధార్వాడ్‌ ప్రాంతం నుంచి సాంప్రదాయక కసూటి పనితో పాటు చేతితో నేసిన ఇల్కల్‌ పట్టు చీరను ధరించారు.

కసుతి అనే పదం జానపద ఎంబ్రాయిడరీ క్రాఫ్ట్‌ కు సాంప్రదాయ రూపంగా జీఐ ట్యాగ్(GI Tag) తో ధార్వాడ్‌ ప్రాంతానికి ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. చేతితో తయారు చేసిన కసూటి పనిలో రథాలు, ఏనుగులు, ఆలయ గోపురం, నెమళ్లు, జింకలు, తామర పువ్వులు ఎంబ్రాయిడరీ పని ఉంటుంది.

2023 బడ్జెట్ ప్రెజెంటేషన్‌ కోసం సీతారామన్‌ ధరించిన చీర పై రథాలు, నెమళ్లు, తామరపువ్వులు ఉన్నాయి. ఈ భారీ పట్టు చీరను ధార్వాడ్ లోని ఆరతి హిరేమఠ్‌ యాజమాన్యంలోని ఆరతి క్రాఫ్ట్స్ డిజైన్ చేసింది. అంతకు ముందు సంవత్సరం ఆమె ఎరుపు రంగు చీరను ధరించి ఉంటే..అంతకు ముందు సంవత్సరం 2020లో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన సమయంలో పసుపు చీరను ఎంచుకున్నారు. 2019లో నిర్మలా సీతారామన్‌ బంగారు ట్రిమ్ తో గులాబీ మంగళగిరి చీరను కట్టుకున్నారు.

నిర్మలమ్మ ఈ ఏడాదితో కలిపి మొత్తంగా ఆరుసార్లు బడ్జెట్‌ ను సమర్పించననున్నారు. ఇప్పటి వరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ మాత్రమే 5 సార్లు వార్షిక బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టారు. ఇప్పుడు ఆ రికార్డును నిర్మలమ్మ దాటేసింది.

Also Read : సొంత ఇంటి కలను నేరవేరుస్తాం…నిర్మలా సీతారామన్

Advertisment
Advertisment
తాజా కథనాలు