Nipah Virus: కేరళలో మరోసారి నిపా వైరస్‌ కలకలం..!

కేరళలో తీవ్రమైన నిపా ఇన్ఫెక్షన్ ముప్పు మరోసారి కలకలం రేపుతుంది. మలప్పురం జిల్లాలో సేకరించిన గబ్బిలాల శాంపిల్స్‌లో నిపా వైరస్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఇన్ఫెక్షన్‌ తో 14 ఏళ్ల యువకుడు చనిపోయిన తరువాత మరో యువకుడికి కూడా నిపా సోకినట్లు అధికారులు గుర్తించారు.

New Update
Nipah Virus: వణికిస్తున్న నిపా వైరస్..ఇద్దరు మృతి!

Nipah Virus: కేరళలో తీవ్రమైన నిపా ఇన్ఫెక్షన్ ముప్పు మరోసారి కలకలం రేపుతుంది. మలప్పురం జిల్లాలో సేకరించిన గబ్బిలాల శాంపిల్స్‌లో నిపా వైరస్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. జూన్ 21న మలప్పురం జిల్లాలో నిపా ఇన్ఫెక్షన్ కారణంగా 14 ఏళ్ల యువకుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో యువకుడికి కూడా నిపా వైరస్‌ సోకడంతో కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నాడు.

పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే యువకుడికి కూడా నిపా ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు నిర్ధారించింది. టీనేజర్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచారు. 27 పళ్ల నుంచి గబ్బిలాల నమూనాలను సేకరించినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఐదు కిలోమీటర్ల వ్యాసార్థం నుంచి ఈ నమూనాలను సేకరించారు.

వీటిలో ఆరు శాంపిల్స్‌లో నిపా వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. సోకిన యువకుడితో పరిచయం ఉన్న వారందరి నమూనాలను కూడా పరీక్షించినట్లు వీణా జార్జ్ తెలిపారు. అయితే ప్రస్తుతానికి, ఎవరికీ ఇన్ఫెక్షన్ నిర్ధారణ అవ్వలేదు. నిపా వైరస్ సోకిన యువకుడితో మొత్తం 472 మంది కాంటాక్ట్‌ ఆయన చెప్పారు. వీరిలో 261 మంది 21 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు వీరి పేర్లను జాబితా నుంచి తొలగించారు.

Also read: ప్రతీకారం తీర్చుకున్న జకోవిచ్..తొలి ఒలింపిక్ స్వర్ణం గెలిచాడు!!

Advertisment
తాజా కథనాలు