Murder: 9వ తరగతి బాలిక హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు! రాంబిల్లి తొమ్మిదొవ తరగతి బాలిక హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను జైలుపాలు చేసిందనే పాత కక్షతోనే ప్రమోన్మాది సురేష్ ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. By srinivas 07 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Anakapalle Student: తొమ్మిదొవ తరగతి బాలిక హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బటయకొస్తున్నాయి. ఏడాదిపాటు బాలికను వేధింపులకు గురిచేసిన దుర్మార్గుడు.. చివరికి అత్యంత దారుణంగా కడతేర్చడం వెనక పాత పగే కారణమని పోలీసులు నిర్దారించారు. ఈ మేరకు గతంలో అమ్మాయిని ప్రేమించాలంటూ వెంటపడి వేధించడంతో తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది బాలిక. దీంతో అతనిపై పోక్సో కేసుపెట్టి జైలుకు పంపించగా ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు. పాత కక్షతోనే దారుణం.. ఈ క్రమంలోనే రాంబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొప్పుగుండుపాలేనికి చెందిన బాలిక (14)పై కక్ష పెంచుకున్న నిందితుడు బోడాబత్తుల సురేష్(26) శనివారం ఆమె ఇంట్లోనే నరికి చంపాడు. అయితే రక్తపు మడుగులో ఉన్న మనవరాలిని చూసి గుండెలు బాదుకుంది నానమ్మ. చుట్టుపక్కలవారు అప్పటికే బాలిక మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిడ్డ హత్యతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్‌లను రప్పించి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఇక ఈ దారుణంపై హోం మంత్రి వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుణ్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణను ఆదేశించారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, వీలైనంత త్వరగా పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. #murder #suresh #9th-class మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి