శ్రీనివాస్ గౌడ్ తమ్ముడికి బిగ్ షాక్ .. తొమ్మిది కేసులు నమోదు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కు బిక్ షాక్ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత రాజేందర్‌రెడ్డి ఇంటిపై శ్రీకాంత్ దాడి చేసినట్లు రుజువు కావడంతో పలు IPC సెక్షన్ల కింద తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 17 Dec 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కు పోలీసులు షాక్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేత ఇంటిపై శ్రీకాంత్ దాడికి పాల్పడినట్లు రుజువుకావడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నిందుతులుగా ఉన్న ఇద్దరినీ అరెస్ట్ అదుపులోకి తీసుకోగా ఏ1 శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇటీవల ఎన్నికల సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి అనుచరులు వీరంగం సృష్టించారు. కాంగ్రెస్ నేత రాజేందర్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు. డిసెంబర్ 2న 20మందితో రాజేందర్ రెడ్డి ఇంట్లోకి చొరబడి, రాజేందర్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో సీసీ టీవీ ఫుటేజ్ లు ధ్వంసం చేశారని ఫిర్యాదులు అందాయి. అలాగే మరో కాంగ్రెస్‌నేత వెంకట్ రెడ్డి, వాచ్‌మెన్ సచిన్‌పై కూడా శ్రీకాంత్ అనుచరులు దాడికి పాల్పడ్డట్లు రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రి తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ కు బిగ్ షాక్ ఇస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. IPC 448, 324, 427, 504, 506, 379 కేసులు ఇప్పటికే నమోదవగా తాజాగా డిసెంబర్ 15న 458, 354, 323 సెక్షన్ల కింద శ్రీకాంత్ గౌడ్‌పై అదనపు కేసులు రికార్డ్ చేసినట్లు రూరల్ ఎస్సై తెలిపారు. ఇది కూడా చదవండి : ఏపీలో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్ డిసెంబర్ 2వ తేదీన శ్రీకాంత్ గౌడ్ తో పాటు సహచరులు ఇద్దరు వ్యక్తులపై రాడ్లతో దాడులకు దిగారు. పిటిషనర్ ఇంట్లోకి చొరబడి శ్రీనివాస్ గౌడ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. తమను చంపేస్తామని బెదిరించారని, ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారంటూ ఆరోపిణలు అందాయి. సీసీ టీవీ ఫుటేజ్ ఉన్న డేటా ఉన్న హార్డ్ డిస్క్ ను కూడా ఎత్తుకెళ్లారంటూ ఫిర్యాదు ఇచ్చారని, దీంతో ఇక ఈ కేసులో ఫ్రధాన నిందితులుగా ఉన్న A3 మహేష్ గౌడ్, A6 రమేశ్ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందుతుడు శ్రీనివాస్‌గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. దాడి సమయంలో ఇంట్లో కనిపించకుండా పోయిన హార్డ్ డిస్క్‌లను బైపాస్ రోడ్డు దగ్గర స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు అన్న పదవిని అడ్డం పెట్టుకుని కొంతకాలంగా మహబూబ్ నగర్ లో అవినీతి, భూ కబ్జాలకు పాల్పడడం, అడ్డం వచ్చిన వారిపై దాడులు చేసినట్లు శ్రీకాంత్ పై పలు ఆరోపణలున్నాయి. #srinivas-goud #mahaboobnagar #srikanth-goud మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి