America : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(America Elections) రిపబ్లికన్ పార్టీ(Republican Party) తరుఫున పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి(Nikki Haley) ఓ ఊహించని సంఘటన ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె న్యూ హాంప్ షైర్ లో ప్రచార సభలో ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో జన సమూహం లో నుంచి ఆమె కు ఓ ప్రపోజల్ వచ్చింది. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరబూసాయి.
నిక్కీ కి ట్రంప్ మద్దతుదారుడు ఒకర పెళ్లి ప్రపోజల్(Marriage Proposal) తీసుకుని వచ్చాడు. దీంతో ఓ క్షణకాలం పాటు షాక్ కు గురైన నిక్కీ.. ఆ తరువాత తేరుకుని ఆమె కూడా సరదాగా నవ్వుతూ స్పందించారు. ఆమె పెళ్లి ప్రపోజల్ తీసుకుని వచ్చిన వ్యక్తిని '' నాకు ఓటు వేస్తావా? '' అని అడిగారు.
దానికి అతను హేళనగా ట్రంప్(Trump) కే ఓటు వేస్తానని సమాధానం ఇచ్చాడు. దీంతో కాసేపు అసహనానికి గురైన నిక్కీ.. అయితే ఈ సమూహం మధ్య నుంచి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచారు. దీంతో ఆడిటోరియం మొత్తం సైలెంట్ అయిపోయింది. ఆ తరువాత కాసేపటికీ ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు.
రిపబ్లికన్ పార్టీ తరుఫున పోటీ చేసేందుకు ట్రంప్ నకు పోటీదారుగా 52 ఏళ్ల భారత మూలాలు ఉన్న నిక్కీ హేళీ బరిలో నిలిచారు. ట్రంప్ నకు పోటీగా నిలిచిన వారిలో నిక్కీ హేలీ చివరి వారు కావడం గమనార్హం. ఇటీవల అయోవా రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ నకు 51 శాతం ఓట్లు రాగా..నిక్కీ హేలీకి కేవలం 19 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో భారతీయ అమెరికన్ వివేక్ రామ స్వామికి 7.7 శాతం ఓట్లు రాగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.
నిక్కీ తల్లిదండ్రులు 1960 లోనే అమెరికా వచ్చి స్థిరపడిపోగా వారికి 1972లో నిక్కీ పుట్టారు. ఆ తరువాత ఆమె మైఖేల్ హేలీని పెళ్లి చేసుకున్నారు. సౌత్ కరోలినా గవర్నర్ గా నిక్కీ గతంలో రెండు సార్లు బాధ్యతలు నిర్వహించారు. ట్రంప్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఆమె ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా పని చేశారు.
Also read: సోషల్ మీడియా వేదిక వంగవీటి..బోండా వర్గీయుల వార్!