Nikhil : రాజకీయాల్లోకి హీరో నిఖిల్‌... కానీ అసలు ట్విస్ట్‌ ఇక్కడే ఉంది!

నటుడు నిఖిల్‌ సిద్దార్ధ్‌ టీడీపీ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలను ఆయన టీమ్‌ కొట్టిపారేసింది. ఆయన కేవలం మావయ్య ప్రచారం కోసం మాత్రమే చీరాలకు వచ్చినట్లు తెలిపారు. అంతేకానీ ఏ పార్టీలోనూ ఆయన చేరలేదని టీమ్‌ వివరించింది.

New Update
AP News: టీడీపీలో చేరిన హీరో నిఖిల్..!

Politics : బాలనటుడిగా చిత్ర సీమకు పరిచయం అయిన నటుడు నిఖిల్‌ సిద్దార్థ్‌(Nikhil Siddhartha). స్వామి రారా(Swamy Ra Ra) సినిమాతో తనలోని నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ తన సినిమాల మీద అంచనాలు పెంచేలా చేశాడు. కార్తీకేయ 2 సినిమాతో పాన్‌ ఇండియా హీరో(PAN India Hero) అయిపోయాడు. ప్రస్తుతం నిఖిల్‌ తాజాగా స్వయంభూ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

టీడీపీ(TDP) లో ఆయన చేరినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నారా లోకేష్‌. ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ యేయడంతో అవి కాస్త వైరల్‌ గా మారాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. నిఖిల్‌ టీడీపీలో చేరలేదు. నిఖిల్‌ మేనమామ కొండయ్య చీరాల నుంచి టీడీపీ తరుఫున పోటీ చేస్తున్నారు.

ఆయనకు సపోర్ట్‌ చేయడానికి నిఖిల్‌ అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో లోకేష్‌ ను కూడా కలవడంతో ఆయన కండువా కప్పారు. కేవలం ప్రచారానికి మాత్రమే అక్కడికి వెళ్లానని.. టీడీపీ లో చేరలేదు అని నిఖిల్‌ తెలిపారు. తన మావయ్యకి సపోర్ట్‌ చేస్తున్నట్లు నిఖిల్‌ చెప్పుకొచ్చారు.

Also Read : టీడీపీకి బత్యాల గుడ్‌ బై…టికెట్‌ రాకపోవడంతో నిర్ణయం!

Advertisment
తాజా కథనాలు