తెలంగాణ యువతేజం.. నిఖత్ జరీన్ బర్త్ డే స్పెషల్!

New Update

టోర్నీ ఏదైనా పతకం పక్కా అన్న రీతిలో నిఖత్ జరీన్ పంచ్ లు ఉంటాయి. 26 ఏళ్లకే చరిత్ర సృష్టించించిన ఈ తెలంగాణ యువ బాక్సర్.. రానున్న పోటీలపై ఫోకస్ చేస్తోంది. భవిష్యత్‌ లో మరిన్ని విజయాలు సాధించాలని, భారత బాక్సింగ్‌ యవనికపై వెలుగులీనుతున్న నిఖత్‌ కు జన్మదిన శుభాకాంక్షలు.

nikhath jareen barth day special

వ్యక్తిగత జీవితం

నిఖత్ జరీన్ 1996 జూన్ 14న తెలంగాణలోని నిజామాబాద్‌ లో ఎండీ జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా దంపతులకు జన్మించింది. తన 13 ఏటలోనే బాక్సింగ్ ప్రారంభించింది. జరీన్ బాక్సింగ్ ప్రయాణానికి తండ్రి పూర్తి మద్దతు ఇచ్చారు. హైదరాబాద్‌ లోని ఏవీ డిగ్రీ కాలేజీలో చదువుతున్న రోజుల్లో జలంధర్‌ లోని అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ పోటీల్లో నిఖత్ బెస్ట్ బాక్సర్ ఛాంపియన్ షిప్ సాధించింది.

వృత్తి -విజయాలు

జరీన్ తొలి బంగారు పతకాన్ని 2010లో నేషనల్ సబ్ జూనియర్ మీట్‌ లో గెలుచుకుంది. టర్కీలో 2011లో జరిగిన మహిళల జూనియర్, యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్‌ లో, ఫ్లై వెయిట్ విభాగంలో ఆమె తొలి అంతర్జాతీయ బంగారు పతకాన్ని సాధించింది. జరీన్ టర్కిష్ బాక్సర్ ఉల్కు డెమిర్‌ తో పోరాడి 3 రౌండ్ల తరువాత 27:16 తేడాతో ఆమెపై గెలిచింది జరీన్ 51 కిలోల విభాగంలో రష్యాకు చెందిన పాల్ట్సేవా ఎకాటెరినాను ఓడించి, 2014లో సెర్బియాలోని నోవి సాడ్‌లో జరిగిన 3వ నేషన్స్ కప్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్‌ లో బంగారు పతకం సాధించింది.

నిఖత్ జరీన్ సాధించిన అవార్డులు

నిఖత్ నిజామాబాద్‌ కు అధికారిక రాయబారిగా నియమితులయింది. 2011 ప్రపంచ జూనియర్, యూత్ చాంపియన్ షిప్‌ లో స్వర్ణం. 2014 నేషన్స్ కప్‌ లో స్వర్ణం, ఆల్ ఇండియా ఇంటర్-యూనివర్సిటీ బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్, జలంధర్, పంజాబ్ - ఫిబ్రవరి 2015 లో 'ఉత్తమ బాక్సర్, 2019లో ఎక్సలెన్స్ విభాగంలో జెఎఫ్ డబ్ల్యూ అవార్డు, 2019, 2022ల్లో స్ట్రాంజా మెమోరియల్ లో స్వర్ణం, 2022 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, 2023 IBA ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం, 2022 నవంబర్ 30న అర్జున అవార్డు సాధించింది. 2022 నవంబర్‌ 30న జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ లో నిఖత్ జరీన్ అర్జున అవార్డు అందుకుంది. ఈ యువ బాక్సర్ ఇంకా మరిన్ని అవార్డులు అందుకోవాలని Rtv తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

Advertisment
Advertisment
తాజా కథనాలు