Nifty Record: నిఫ్టీ దూకుడు.. ఆల్ టైమ్ హై టచ్ చేసిన సూచీ.. 

నిన్న సెన్సెక్స్ తొలిసారిగా 70వేల మార్క్ దాటి రికార్డు సృష్టించింది. ఈరోజు (డిసెంబర్ 12) దానికి కొనసాగింపు అన్నట్టు నిఫ్టీ ఆల్ టైమ్ హై 21,037 స్థాయిని చేరుకుంది. గత ఐదు రోజుల్లోనూ స్టాక్ మార్కెట్ దాదాపు 40% పెరిగింది. 

New Update
Nifty Record: నిఫ్టీ దూకుడు.. ఆల్ టైమ్ హై టచ్ చేసిన సూచీ.. 

Nifty Record : నిఫ్టీ ఈరోజు అంటే మంగళవారం (డిసెంబర్ 12) సరికొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ 21,037 స్థాయిని తాకింది. అయితే సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 16 పెరుగుతుండగా, 14 క్షీణిస్తున్నాయి. హెల్త్‌కేర్, ఫార్మాకు సంబంధించిన స్టాక్స్ ఈరోజు పెరుగుదలను చూపుతున్నాయి. బ్యాంక్, ఆటో, రియల్టీ షేర్లలో క్షీణత ఉంది. నిధుల సమీకరణకు సంబంధించిన సమావేశం - NSEలో చేరడానికి సంబంధించిన వార్తల తర్వాత, స్పైస్‌జెట్ షేర్లు 2% కంటే ఎక్కువ పెరిగాయి. దాదాపు రూ.62 వరకు ట్రేడవుతోంది. గత 5 రోజుల్లో స్టాక్ దాదాపు 40% పెరిగింది.

సెన్సెక్స్ నిన్న అంటే డిసెంబర్ 11న ఆల్ టైం హై 70,057ని తాకింది. 69,893 దగ్గర క్లోజింగ్ గా నిలిచింది. ఇంతకు ముందు 2023 డిసెంబర్ 8న ఆల్ టైం హై 69,928కి చేరింది సెన్సెక్స్. అయితే, ఆరోజు 69,825 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు అంటే డిసెంబర్ 12న ఆల్ టైం హై 21,037ని తాకింది. ఇంతకు ముందు నిన్న అంటే డిసెంబర్ 11న అల్ టైమ్ హై 21,026 పాయింటా వద్ద క్లోజ్ అయింది. 

Also Read: ఆల్ టైమ్ హైలో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రియాల్టీ షేర్ల హవా.. 

ఈ వారం మూడు IPOలలో పెట్టుబడి పెట్టే అవకాశం

ఈ వారం 3 ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లు అంటే IPOలు ఓపెన్ అవుతున్నాయి.  ఇందులో డోమ్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐనాక్స్ సివిఎ - ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పేర్లు ఉన్నాయి. డోమ్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ - ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ IPO డిసెంబర్ 13న ప్రారంభం కానుంది. INOXCVA IPO డిసెంబర్ 13న ఓపెన్ అవుతుంది. 

నిన్న మార్కెట్ దూకుడు.. 

నిన్న అంటే డిసెంబర్ 12న స్టాక్ మార్కెట్ సరికొత్త ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ తొలిసారిగా 70 వేలు దాటి 70,057 స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా 21,026 స్థాయిని తాకింది. దీని తర్వాత సెన్సెక్స్ 102 పాయింట్లు పెరిగి 69,928 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 27 పాయింట్లు పెరిగి 20,997 వద్ద ముగిసింది.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు