Summer : మరో ఐదు రోజుల్లో మండిపోనున్న ఎండలు..!

రాష్ట్రంలో సోమవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్‌ నుంచి సుమారు 4 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరుగుతాయని తెలిపింది.

New Update
Telangana : ఈ వారం మరింత మండనున్న ఎండలు!

Temperature : తెలంగాణ(Telangana) లో మొన్నటి వరకు వాతావరణం(Climate) చల్లబడి కాస్త ఉపశమనం కలిగించింది. దీంతో వారం రోజుల పాటు ఎండ వేడి లేకుండా వాతావరణం కాస్త చల్లబడింది. కానీ మళ్లీ నేను ఎక్కడికి వెళ్లేలేదు.. మీ తాట తీయడానికి రెడీగా ఉన్నాను అంటూ భానుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. దీంతో ఎండ చురుక్కు బాగా పెరిగింది.

దీంతో రాష్ట్రంలో సోమవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) తెలిపింది. వచ్చే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్‌ నుంచి సుమారు 4 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరుగుతాయని తెలిపింది. అంతేకాకుండా గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండలు ఇరగదీస్తున్నాయి.

ఇప్పటికే రాష్ట్రంలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతతలు 40 డిగ్రీలకు దగ్గరలో ఉన్నాయి. సంగారెడ్డిలో 38. 7 డిగ్రీలు నమోదు అవ్వగా... మెదక్‌ లో 37.9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఎండలు పెరుగుతున్న క్రమంలో ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎండ వేడి(Sun Heat) కి ప్రజలెవరూ కూడా బయట తిరగకపోవడంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. రానున్న 5 రోజులు రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని హెచ్చరిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్తే నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Also Read : వేసవి కాలంలో జీర్ణసమస్యలు వేధిస్తున్నాయా.. అయితే ఈ పండుతో చెక్‌ పెట్టేయ్యోచ్చు!

Advertisment
Advertisment
తాజా కథనాలు