Deepika Padukone: తల్లి కాబోతున్న దీపికా పదుకొణె.. వైరలవుతున్న న్యూస్

స్టార్ నటి దీపికా పదుకొణె ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్. ఈ బాలీవుడ్ బ్యూటీ త్వరలోనే తల్లికాబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే కొన్ని నెలల గర్భంతో ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. దీనిపై రణ్ వీర్-దీపికలు ఇంకా స్పందించలేదు.

Deepika Padukone: తల్లి కాబోతున్న దీపికా పదుకొణె.. వైరలవుతున్న న్యూస్
New Update

Deepika Padukone is Pregnant?: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ఈ  బ్యూటీ నటించిన అన్నీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ ఫుల్ ఫామ్ లో దూసుకెళ్తోంది.

తల్లి కాబోతున్న దీపికా పదుకోన్ 

అయితే తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ.. తల్లి కాబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అసలు విషయం ఏంటంటే.. ఇటీవలే ఫిబ్రవరి 18 న లండన్ లో జరిగిన బాఫ్టా కార్యక్రమంలో దీపికా (Deepika Padukone) హోస్ట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో రెడ్ కార్పెట్ పై నడిచిన దీపికా.. తన చీర కొంగుతో బేబీ బంప్ ను దాచడానికి ప్రయత్నించారంటూ గాసిప్స్ మొదలయ్యాయి. రెడ్ కార్పెట్ పై నడుస్తూ.. ఈ బ్యూటీ చీర కప్పుకోవడంతో అనుమానాలకు తెర లేపింది.

Also Read: హీరో నిఖిల్ తండ్రయ్యాడు.. వారసుడొచ్చాడని సంబరపడుతున్న ఫ్యాన్స్!

ఇక న్యూస్ వైరలవడంతో.. బేబీ పదుకోన్ వస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పలు నివేదికలు కూడా ఈ విషయాన్నీ వెల్లడించడంతో.. దీపికా ప్రెగ్నెంట్ అని నమ్ముతున్నారు. కానీ దీని పై స్టార్ కపుల్ రణవీర్ (Ranveer Singh) , దీపికా నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 2018లో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్- దీపికా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరు.. వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీగా సాగుతున్నారు.

దీపికా మూవీస్

ప్రస్తుతం దీపికా.. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కల్కి సినిమా చేస్తుంది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు బ్రహ్మస్త్ర 2, రణ్‌వీర్ సరసన సింగం అగైన్ సినిమాలు చేస్తోంది.

Also Read: Anushka Shetty: ‘శీలావతిగా’.. అనుష్క.. 14 ఏళ్ళ తర్వాత మరో సారి క్రిష్, అనుష్క కాంబో రిపీట్

#deepika-padukone #ranveer-singh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe