యూపీ అసెంబ్లీలో కొత్త రూల్స్, పేపర్లు చించొద్దు..బిగ్గరగా నవ్వొద్దు..!!

ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీలో యోగి సర్కార్ కొత్త రూల్స్ తీసుకువస్తోంది. అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు అనుమతించరాదని..లాబీలో దగ్గరగా నవ్వడం, మాట్లాడటం చేయరాదని..సభలో పేపర్లు చించొద్దని ఈ రూల్స్ చెబుతున్నాయి.

author-image
By Bhoomi
యూపీ అసెంబ్లీలో కొత్త రూల్స్, పేపర్లు చించొద్దు..బిగ్గరగా నవ్వొద్దు..!!
New Update

UP Assembly New Rules : యూపీ అసెంబ్లీలో కొత్త నిబంధనలు తీసుకువస్తుంది యోగి సర్కార్. ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా ఈ రూల్స్ నిలువరించనున్నాయి. పేపర్లు చించేయడం, స్పీకర్ వైపునకు వీపు పెట్టి నిలబడటం, లేదా కూర్చోవడం, బిగ్గరగా నవ్వడం, లేదా అరవడం వంటివి చేయకూడదని ఈ రూల్స్ చెబుతన్నాయి. యూపీ శాసనసభ కొత్త విధానపరమైన నియమాలు,ప్రవర్తనా నియమాలను పొందబోతోంది. ఇది సభ్యుల ప్రవర్తనకు కఠినమైన మార్గదర్శకాలను అమలు చేయడమే కాకుండా సభా వ్యవహారాలను నిర్వహించే ప్రక్రియను కూడా సులభతరం చేస్తుంది.

1958లో యూపీ అసెంబ్లీ రూల్స్ పాస్ చేయగా...వాటని రీప్లేస్ చేస్తూ లేటెస్టుగా కొత్త రూల్స్ తెస్తున్నారు. ఈ రూల్స్ ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం ఆ రూల్స్ పై చర్చ జరుగుతుంది. అనంతరం అమోదించనున్నట్లు యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీశ్ మహానా తెలిపారు.

ఈ కొత్త నిబంధనల ప్రకారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పేపర్లు చించడానికి వీల్లేదు. ప్రసంగిస్తూ లేదా ప్రశంసిస్తూ గ్యాలరీలోని ఇతరలకు వేలు చూపించరాదు. స్పీకర్ వైపు వీపు పెట్టి నిలబడటం లేదా కూర్చోవడం వంటివిచేయకూడదు. అలాగే సభలోకి ఆయుధాలు తీసుకురావడం, ప్రదర్శించడం కొత్త రూల్స్ ప్రకారం అనుమతించబడవు. ఇక సభలో పొగ త్రాగరాదు. అలాగే లాబీలో బిగ్గరగా నవ్వకూడదు. మాట్లాడకూడదని కొత్త రూల్స్ ఆదేశిస్తున్నాయి. ఈ రూల్స్ ప్రకారం ఎమ్మెల్యేలు స్పీకర్ అసనానికి గౌరవసూచకంగా వంగి నమస్కరించాల్సి ఉంటుంది.

Also Read: ఇమ్రాన్ ఖాన్‎కు మరో షాక్.. ఎన్నికల్లో పాల్గొనకుండా ఐదేళ్ల అనర్హత వేటు..!!

#yogi-adityanath #up-news #uttar-pradesh-news #yogi #up-assembly-new-rules #up-assembly-rules #up-mlas #no-phones #tearing-papers #new-rules-of-up-assembly #uttar-pradesh-legislative-assembly
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe