సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం.. ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇకనుంచి ఆర్డీవో ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి.. ఓ సర్టిఫికేట్ జారీ చేస్తాయి. దాన్ని తీసుకెళ్లి ఆర్డీఓ ఆఫీసులో ఇచ్చి డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. . కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Also read: ఏపీ అలర్లు..150 పేజీలతో ప్రాథమిక నివేదిక.. 33 కేసులు, 1370 మంది నిందితులు..!
అయితే ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు కేంద్రం పలు నిబంధనలు పెట్టింది. లైట్ మోటార్ వెహికిల్ ట్రైనింగ్ కోసం ఒక ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించాలంటే అదనంగా మరో రెండు ఎకరాల స్థలం ఉండాలి. రూల్స్‌కు అనుగుణంగా టెస్ట్ నిర్వహించేందుకు అన్ని సదుపాయాలు కావాలి. ట్రైనర్లు కచ్చితంగా హైస్కూల్ విద్యను పూర్తి చేయాలి. డ్రైవింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉండాలి. అలాగే వీళ్లకి బయోమెట్రిక్స్, ఐటీపై కనీస అవగాహన ఉండాలి. రూల్స్ ప్రకారం ఇలాంటి అర్హతలు ఉన్న ప్రైవేటు సంస్థలకు డ్రైవింగ్ టెస్టు నిర్వహించే అధికారం వర్తించనుంది.
డ్రైవింగ్ నేర్పించేందుకు కాల పరిమితికి సంబంధించి కూడా మరికొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. లైట్ వెహికిల్ ట్రైనింగ్ కోసం నాలుగు వారాల పాటు.. కనీసం 29 గంటల పాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఎనిమిది గంటలు థియరీ, 21 గంటలు ప్రాక్టికల్ కేటాయించాలి. ఇక హెవీ మోటార్ వెహికిల్స్ డ్రైవింగ్ శిక్షణ ఆరువారాల పాటు.. కనీసం 39 గంటలు ఇవ్వాలి. ఇందులో ఎనిమిది గంటల థియరీ, 31 గంటలు ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది.
Also read: మైనార్టీలకు వ్యతిరేకంగా తామేప్పుడు వ్యవహారించలేదు..మోదీ