Railway News : తెలుగు రాష్ట్రాల్లో 18 రైళ్ళకు కొత్త హాల్ట్‌లు

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్. మన రాష్ట్రాల్లో మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగనున్నాయి. ప్రయాణికుల డిమాండ్ మేరకు మొత్తం 18 రైళ్ళకు హాల్ట్‌లు ప్రకటించింది రైల్వేశాఖ. ఇందులో తెలంగాణలో 10 ఉండగా..ఏపీలో 8 హాల్ట్‌లు ఉన్నాయి.

Railway Jobs: రైల్వేలో 9,144 ఉద్యోగాలు..నోటిఫికేషన్ విడుదల
New Update

New Stops In Telugu States : తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు(Railway Passengers) గుడ్ న్యూస్ చెప్పింది భారత రైల్వేశాఖ(Indian Railways). రెండు రాష్ట్రాల మీదుగా పలు రైళ్ళకు కొత్త స్టాప్‌లను ప్రకటించింది. ఏపీ(AP), తెలంగాణ(Telangana) ల్లో ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైళ్లు మరికొన్ని ఇక మీదట ఇక్కడ స్టేషన్లలో ఆగనున్నాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుకూలంగా రైల్వేశాఖ.. మొత్తం 18 రైళ్లకు కొత్త హాల్ట్(New Halts) లు ప్రకటించింది. ఎప్పటి నుంచి రైళ్ళు ఆగతాయనే వివరాలను త్వరలోనే ప్రకటించనుంది రైల్వేశాఖ.

రైళ్ళు-కొత్త హాల్ట్‌లు..

రామేశ్వరం - భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్ - రాజమండ్రి రైల్వే స్టేషన్.

హౌరా - పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ - రాజమండ్రి స్టేషన్. హుబ్లీ - మైసూర్ - హంపి ఎక్స్ ప్రెస్ - అనంతపురం స్టేషన్.

సికింద్రాబాద్ రేపల్లె ఎక్స్ ప్రెస్ - సిరిపురం.

కాజీపేట -బలార్ష ఎక్స్ ప్రెస్ - రాఘవపురం.

కాజీపేట - బలార్ష ఎక్స్ ప్రెస్ - మందమర్రి స్టేషన్. పూణె - కాజీపేట ఎక్స్ ప్రెస్ - మంచిర్యాల.

దౌండ్ - నిజామాబాద్ ఎక్స్ ప్రెస్ - నవీపేట్.

తిరుపతి - ఆదిలాబాద్ - కృష్ణా ఎక్స్ ప్రెస్ - మేడ్చల్ స్టేషన్.

భద్రాచలం - సింగరేణి ఎక్స్ ప్రెస్ - బేతంపూడి స్టేషన్. నర్సాపూర్ - నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ - మహబూబాబాద్ స్టేషన్.

సికింద్రాబాద్ - తిరుపతి - వందేభారత్ ఎక్స్ ప్రెస్ - మిర్యాలగూడ స్టేషన్.

సికింద్రాబాద్ - భద్రాచలం - కాకతీయ ఎక్స్ ప్రెస్ - తడకలపుడి.

రేపల్లె - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ - రామన్నపేట. గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ - ఉంద నగర్. కాజీపేట్ - బలార్ష ఎక్స్ ప్రెస్ - Rechni Road, తాండూరు. తిరుపతి - సికింద్రాబాద్ - పద్మావతి ఎక్స్ ప్రెస్ - నెక్కొండ స్టేషన్.

భద్రాచలం రోడ్డు - సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్ ప్రెస్ - బేతంపుడి.

రైల్వే శాఖ తెలిపన కొత్త ప్రకటన ప్రకారం తెలంగాణలో 10, ఏపీలో 8 కొత్త స్టాప్‌లలో ఎక్స్‌ప్రెస్ రేళ్ళు ఆగనున్నాయి. ఈ కొత్త హాల్ట్‌ల విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తన విజ్ఞప్తిని ఆమోదించి కొత్త స్టాప్‌లకు ఆమోదం తెలిపినందుకు ప్రధాని మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవీకి ధన్యవాదాలు తెలిపారు.

Also Read : Bamk Employees: 17శాతం జీతాల పెంపు..వారానికి 5రోజులే పని

#trains #telugu-states #new-halts #indian-railway
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe