Telangana: తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్.. నేడే భూమి పూజ.. ఎక్కడంటే? సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో.కొలువై ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి ఏటా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ఇక్కడ హాల్డ్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలనుకున్నారు. మంత్రి కిషన్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. By Bhavana 15 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Railway Station at Komuravelli: తెలంగాణలో మరో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు కాబోతుంది. గురువారం ఈ రైల్వే స్టేష్టన్ నిర్మాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) శంకుస్థాపన చేయనున్నారు. ఇంతకీ ఈ రైల్వే స్టేషన్ తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు అవుతుందో తెలుసా..! సిద్దిపేట జిల్లా (Siddipet) కొమురవెల్లిలో. ఇక్కడ కొలువై ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి ప్రతి ఏటా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ఇక్కడ హాల్డ్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే రైల్వే మంత్రిత్వ శాఖ (Ministry of Railway) కూడా ఇక్కడ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అనుమతిలిచ్చింది. దీంతో ఎంతో కాలంగా రైల్వే హాల్డ్ కోసం ఎదురు చూస్తున్న అక్కడి ప్రజల ఆకాంక్ష నెరవేరింది. కొత్త రైల్వే స్టేషన్ లో అధికారులు లైటింగ్, బుకింగ్ విండో, ఫ్యాన్లు, వెయిటింగ్ హాల్స్ , రూఫ్ ఫ్లాట్‌ఫారమ్ ను కూడా అందిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ర్వైల్వే స్టేషన్ ఆలయానికి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దీంతో స్వామి వారి దర్శనానికి (Komuravelli) వచ్చేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ నుంచి వెళ్లే విద్యార్థులకు, వ్యాపారులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు వివరించారు. మల్లన్న స్వామి (Mallikarjuna Swamy Temple) వారి దర్శనం కోసం సుమారు 4 రాష్ట్రాల నుంచి 25 లక్షలు నుంచి 30 లక్షలు మంది వస్తుంటారు. వీరంతా కూడా ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో ఆలయానికి చేరుకుంటారు. కానీ బస్సులో వచ్చే భక్తులు ప్రధాన రహదారికి మూడు కిలో మీటర్ల దూరంలోనే దిగి ఆలయం వద్దకు వస్తుంటారు. ఇలా రావడం వల్ల ప్రయాణికులు, భక్తులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు ఇక్కడికి రైల్వే స్టేషన్ రావడంతో రైలు ఇక్కడ ఆగుతుండడంతో చాలా సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. Also Read: అమెరికాలో మరోసారి కాల్పులు..ఇద్దరు మృతి.. 22 మందికి గాయాలు! #railway-station #new-railway-station #komuravelli #siddipeta #kishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి