US Teacher: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యారాలే దారుణానికి పాల్పడింది. ఏకంగా ఓ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ విషయం బయటపడటంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని న్యూజెర్సీలో ఫ్రీహోల్డ్ ఇంటర్మీడియట్ స్కూల్లో 43 ఏళ్ల ఎలీసన్ హవెమాన్ అనే మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ ఏడాది మొదటి నుంచే ఆమె విద్యార్థులను లైంగికంగా వేధించడం ప్రారంభించింది. ఓ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్న విషయం బయటకు రావండతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె మాన్‌హట్టన్‌లోని కౌంటీ జైలులో ఉంటోంది.
Also Read: నడిరోడ్డు మీద కూలిన విమానం…ముగ్గురి మృతి!
పోలీసులు బాధితుడైన ఆ మైనర్ బాలుడి వివరాలు వెల్లడించలేదు. ఇంకా ఎవరైనా ఆమె బాధితులు ఉన్నారేమోనని అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పాఠశాల యాజమాన్యం ఆమెను తొలగించింది. మరోవైపు ఎలీసన్ తరఫు న్యాయవాది.. తన క్లయింట్ నిర్దోషి అని చెబుతున్నాడు.
Also read: లోక్‌సభలో శివుని చిత్రపటంతో రాహుల్ .. ఖండించిన మోదీ