Good News For TSSPDCL Users : తెలంగాణ(Telangana) విద్యుత్ వినియోగదారులకు టీఎస్ఎస్‌పీడీసీఎల్ సంస్థ పెద్ద ఊరటనిచ్చే వార్త అందించింది. కరెంట్(Power) కు సంబంధించి తదితర సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు, వ్యాపారవేత్తలు ఇకపై సులభంగా తమ ప్రాబ్లమ్స్ పరిష్కరించుకునేలా కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ మేరకు TSSPDCL అధికారిక యాప్ లో పలు మార్పులు చేసి కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు వరుస ప్రమాదాలు.. కారణమేంటి?.. కుటుంబ సభ్యుల ఆందోళన
ఇంటి నుంచి సమస్యలకు పరిష్కారం..
ఈ మేరకు 'కన్జూమర్ గ్రీవెన్స్'(Customer Grievance) ఫీచర్ ద్వారా బిల్ పేమెంట్స్, బిల్ హిస్టరీ, పవర్ ఔటేజ్, ఓల్టేజ్, మీటరు కాలిపోవడం, మీటర్ సమస్యలు, బిల్లింగ్ సమస్యలు పరిష్కారించుకునేందుకు వీలు కల్పించింది. అలాగే కొత్త పవర్ కనెక్షన్, రూప్ టాప్ సోలార్, టైటిల్ ట్రాన్స్ఫార్మ్, చిరునామాలో మార్పులు చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులున్న విద్యుత్ కార్యాలయానికి వెళ్లకుండా మీ ఇంటి నుంచి సమస్యలను అధికారులకు తెలిపేందుకు వెంటనే మీ ఫోన్లలో ఈ టీఎస్ఎస్‌పీడీసీఎల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని విద్యుత్ అధికారులు తెలిపారు.
అధికారిక లింక్: play.google.com/store/apps/details?id=supply.power.tsspdcl