Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌ లో మరికొన్ని కొత్త ఫీచర్లు!

కొన్ని సార్లు గూగుల్‌ మ్యాప్స్‌ ను ఉపయోగిస్తున్నప్పుడు లొకేషన్‌ హిస్టరీ కొన్నిసార్లు డిఫాల్ట్‌ గా ఆఫ్‌ అయిపోతుంది. దాన్ని ఆన్‌ చేసుకుంటే అదంతా కూడా క్లౌడ్‌ లో సేవ్‌ అవుతుంది. దీన్ని టైమ్‌ లైన్‌ ఫీచర్‌ ఉపయోగించి చూసుకోవచ్చు

Google Maps: మాల్స్ లో పార్క్ చేసిన కారును గుర్తించే అద్భుత ఫీచర్..ఇదే..!!
New Update

కాలం మారుతున్న కొద్ది ప్రతి విషయం చాలా తెలికగా మారుతుంది. ఇంతకు ముందు ఏదైనా చిరునామా కనుగొనాలంటే..ఆ దారిలో ఉన్న వారిని అడుగుతూ వెళ్లడమో లేకపోతే ఏదైనా బండ గుర్తులు పెట్టుకొని వెళ్లడమో ఏదోకటి చేసేవారం. కానీ ప్రస్తుత పరిస్థితులు మారాయి. టెక్నాలజీ బాగా అభివృద్ది చెందింది.

దీంతో ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ ఫోన్‌ వచ్చి చేరింది.దాంట్లో గూగుల్‌ మ్యాప్‌ అనే యాప్‌ ఉండడం వల్ల ఏ అడ్రస్‌ అయినా సరే ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం. బంధువులు కానీ, స్నేహితులు కానీ ఫలానా చోటున ఉన్నాం వచ్చేయమంటూ అడ్రస్‌ లోకేషన్ షేర్‌ చేసేయడం మ్యాప్‌ సాయంతో అక్కడికి చేరిపోవడం ఇప్పుడు చాలా సులభం అయిపోయింది.

ఈ గూగుల్‌ మ్యాప్స్‌ను ఉపయోగించుకునే ఆన్‌ లైన్‌ ఆర్డర్లు కానీ, ఫుడ్‌ డెలివరీ యాప్‌ లు, బైక్‌, కార్‌ రైడింగ్‌ యాప్స్‌ కూడా పని చేస్తున్నాయి. ఇప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగదారులకు కొత్త ఫీచర్లును అందుబాటులోకి తీసుకుని వస్తుంది.

గూగుల్‌ మ్యాప్‌ ఓపెన్‌ చేయగానే మనందరికీ ముందుగా మనం ఎక్కడ ఉన్నామో తెలపడానికి ఓ నీలం చుక్క కనిపిస్తుంది. ఇక నుంచి ఆ నీలం చుక్కని పార్కింగ్‌ సేవ్, షేర్‌ యువర్‌ లోకేషన్‌ కోసం షార్ట్‌ కట్‌ గా వాడుకోవచ్చని యాప్‌ పేర్కొంటుంది.

కొన్ని సార్లు గూగుల్‌ మ్యాప్స్‌ ను ఉపయోగిస్తున్నప్పుడు లొకేషన్‌ హిస్టరీ కొన్నిసార్లు డిఫాల్ట్‌ గా ఆఫ్‌ అయిపోతుంది. దాన్ని ఆన్‌ చేసుకుంటే అదంతా కూడా క్లౌడ్‌ లో సేవ్‌ అవుతుంది. దీన్ని టైమ్‌ లైన్‌ ఫీచర్‌ ఉపయోగించి చూసుకోవచ్చు.

ఇందులో గూగుల్‌ పెద్ద మార్పు తీసుకుని వస్తోందని తెలుస్తుంది. తదుపరి అప్‌ డేట్‌ తో డేటా మొత్తం క్లౌడ్‌ లో కాకుండా పరికరంలోనే సేవ్‌ అవుతుంది. ఇప్పటి వరకు యాప్‌ సంవత్సరంన్నర హిస్టరీని తానుకుతానే డిలీట్‌ చేసుకునేది.

ఇది అతి త్వరలోనే 3 నెలలకే పరిమితం కానుట్లు తెలుస్తోంది. అంటే మూడు నెలల కన్నా పాత సమాచారం డిలీట్‌ అవుతుందన్న మాట. ఎక్కువ కాలం టైమ్‌ లైన్‌ లో జ్ఙాపకాలను సేవ్‌ చేసుకోవాలనుకుంటే పొడిగించుకునే వీలు కూడా ఉంటుందని తెలుస్తోంది. జరిగిన మార్పులు గురించి క్రమంగా ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాల ద్వారా అందుబాటులోకి రానున్నాయి.

Also read: ఓటుకు రూ.3,000.. మహిళలకు పట్టు చీర!

#technology #google-maps #new-feature
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe