బ్రేక్ వేస్తే రెండు ముక్కలైన బైక్.. అదృష్టవంతుడు.. లేకుంటే పోయేవాడు!!

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీకి చెందిన శ్రావణ్ ఇటీవల రూ.65 వేలు పెట్టి ఆటమ్ ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేశాడు. దీంతో కొన్న బైక్ పై జామ్ జామ్ అంటూ షికార్లు చేస్తున్నాడు. పెట్రోల్ అవసరం లేని ఈ ఎలక్ట్రిక్ బైక్ తో డబ్బు ఆదా అవుతుందని భావించాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం కూరగాయల కోసమని మంచిర్యాల మార్కెట్ కు బైక్ పై జాలీగా..

బ్రేక్ వేస్తే రెండు ముక్కలైన బైక్.. అదృష్టవంతుడు.. లేకుంటే పోయేవాడు!!
New Update

ప్రస్తుత కాలంలో ఎలక్ట్రికల్ కార్స్, బైక్స్ , స్కూటర్స్ వినియోగాం జోరుగా సాగుతోంది. ఈ మధ్య విపరీతంగా పెట్రోల్ రేట్లు పెరగడంతో చాలా మంది ఎలక్ట్రికల్ వాహనాల మీద పడ్డారు. దీంతో వీటి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే కొన్నాక మాత్రం బాధపడాల్సి వస్తోంది. ఎందుకు కొన్నాం రా.. బాబు అనిపించేలా చేస్తున్నాయి. అలాగే ఈ మధ్య చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ వాహనాలు పేలిన ఘటనలు కూడా చూశాం. తాజాగా ఓ ఎలక్ట్రిక్ బైక్ రన్నింగ్ లో ఉండగానే రెండు ముక్కలైంది. హ్యాండిల్ ఒక భాగం, సీటు వెనుక మరో భాగం విడిపోయింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తికి కూడా తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీకి చెందిన శ్రావణ్ ఇటీవల రూ.65 వేలు పెట్టి ఆటమ్ ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేశాడు. దీంతో కొన్న బైక్ పై జామ్ జామ్ అంటూ షికార్లు చేస్తున్నాడు. పెట్రోల్ అవసరం లేని ఈ ఎలక్ట్రిక్ బైక్ తో డబ్బు ఆదా అవుతుందని భావించాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం కూరగాయల కోసమని మంచిర్యాల మార్కెట్ కు బైక్ పై జాలీగా బయలుదేరాడు.

మార్గం మధ్యలోకి వెళ్లగానే లైట్ గా బ్రేక్ టచ్ చేశాడు. అంతే హ్యాండిల్ ను బైక్ తో కలిపే ఫార్క్ రన్నింగ్ లోనే విరిగిపోయింది. దీంతో బండి నడిరోడ్డుపై రెండు అయ్యింది. శ్రావణ్ ఉన్నట్లుండి ఒక్కసారిగా ఎగిరి కిందపడ్డాడు. ఆ వెనకాలే టాటా ఏస్ వాహనం రాగా.. దాని కిందకు దాదాపుగా శ్రావణ్ కాళ్లు వెళ్లిపోయాయి. వెంటనే అలర్ట్ అయినా శ్రావణ్.. తన రెండు కాళ్లను ముడిచాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

అదృష్టం కొద్ది అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం ఈ ప్రమాదం నుంచి తేరుకుని శ్రావణ్ పైకి లేచాడు. అందుకు సంబంధించన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. బండి రెండు ముక్కలైపోవటమేంటని ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

#telangana #mancherial #mancherial-district #new-atum-electric-bike #riding
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe