హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్..20వేల మందికి ఉద్యోగాలు

హైదరాబాద్‌లో ఉద్యోగాల జాతర రానుంది. తెలంగాణలో తమ కొత్త బ్రాంచ్ ఓపేన్ చేసేందుకు కాగ్నిజెంట్ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా త్వరలోనే హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ నెలకొల్పనున్నారు.

హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్..20వేల మందికి ఉద్యోగాలు
New Update

Congnizant New Center: హైదరాబాద్‌లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా కాగ్నిజెంట్ తమ కొత్త సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌, కంపెనీ ప్రతినిధులు అమెరికాలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఒప్పందం కుదిరింది. గతేడాది సీఎం బృందం దావోస్‌ పర్యటన సందర్భంలోనే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి.

ఈ మీటింగ్‌లో కాగ్నిజెంట్ ఒప్పందానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కాగ్నిజెంట్ కంపెనీకి అవసరైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై బాగుపడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర టైర్-2 నగరాల్లోనూ ఐటీ సేవలను విస్తరించాలని సీఎం చేసిన సూచనకు కంపెనీప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు.

ఇక హైదరాబాద్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని కాగ్నిజెట్ సీఈవో ఎస్.రవికుమార్ అన్నారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందని చెప్పారు. ఇప్పుడు కొత్తగా రాబోయే సెంటర్‌‌లో ఐటీ సేవలతో పాటూ కన్సల్టింగ్ లో అత్యాధునిక పరిష్కారాలను అందించే విధంగా కృషి చేస్తుందని యన చెప్పారు.

Also Read:Israel-Iran War: ఇది ఇజ్రాయెల్‌ సృష్టించిన నరమేధం.. 5 దేశాల్లో ఏరులై పారుతున్న నెత్తురు!

#cm-revanth-reddy #hyderabad #cognizant #new-center
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe