/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-9-7.jpg)
Bihar: బిహార్‌లోని అరారియా జిల్లాలోని బక్రా నది మీద ఓ వంతెన నిర్మించారు. కుస్రా కాంతా-కిస్రీ ప్రాంతాలను కలిపే ఈ వంతెన పదరియా ఘాట్ దగ్గరలో ఉంది. ఈరోజు ఉదయం ఈ బ్రిడ్జి ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ కూలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ వాడకుండానే బ్రిడ్జి కూలిపోవడం అక్కడ అందరినీ షాక్‌కు గురి చేసింది. మరీ నాణ్యతా లోపమా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. బ్రిడ్జి కూలిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నారు. వంతెనలో మూడు పిల్లర్లు కూలిపోయినట్లు గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చెప్పారు.
బీహార్‌లోని ఈ వంతెన నిర్మించడానికి 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. జిల్లా గ్రామీణ పనుల విభాగం ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్మాణం జరిగింది. బ్రిడ్జి పూర్తి అయి చాలా రోజులూ అయినప్పటికీ దానికి ఇరువైపులా ఉండే రోడ్ల పనులు ఇంకా మిగిలి ఉండటంతో దాన్ని ప్రారంభించలేదు. బీహార్‌లో మూడు నెలల వ్యవధిలో ఇలా వంతెన కూలిపోవడం ఇది రెండోసారి. అంతకు ముందు మార్చిలో సుపౌల్ జిల్లా కోసి నదిపై నిర్మించిన ఓ వంతెన కూలిపోయింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పది మందికిపైగా గాయపడ్డారు. నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం, నాసిరకం పనుల వల్లనే బ్రిడ్జిలు కూలిపోతున్నాయని స్థానికులు, అధికారులు అంటున్నారు.
The bridge collapsed in Bihar before inauguration. I am shocked. Bihar mein log apne netaon ko kyun nahi pakad kar peet rahe hain? pic.twitter.com/UWAiSC8jOT
— Prayag (@theprayagtiwari) June 18, 2024