Kurchi Madathapetti Song: డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ (Mahesh Babu) నటించిన లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం జనవరి 12 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దీని పై ఏదో ఒక వివాదం వినిపిస్తూనే ఉంది. తాజాగా గుంటూరు కారం (Guntur Kaaram) నుంచి రిలీజైన కుర్చీ మడతపెట్టి సాంగ్ సోషల్ మీడియాలో చర్చగా మారింది. మహేష్ బాబు సినిమా పాటలో ఇలాంటి బూతు పదం వాడడం ఏంటని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తూ.. నెట్టింట్లో ట్రోల్ల్స్ మీమ్స్ మొదలు పెట్టారు. అసలు ఈ పాట గురించి మహేష్ బాబు తెలుసా.. త్రివిక్రమ్ ఎలా ఒకే చేశారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు ఈ పాటలో మహేష్ బాబు డాన్స్ స్టెప్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సహజంగా మహేష్ బాబు సినిమాల్లో డాన్స్ నెంబర్ తక్కువగా ఉంటాయి. కానీ ఈ పాటలో మహేష్ బాబు మాస్ డాన్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. కొంత మంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే.. మరి కొంత మంది అసహనంగా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Thaman: తమన్ ను ఏకి పారేస్తున్న నెటిజన్లు.. పవర్ స్టార్ సాంగ్ ను కాపీ కొట్టాడా?
గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాట కు సంబంధించి నెట్టింట్లో మరో ట్రోల్ నడుస్తోంది. మ్యూజిక్ అత్తారింటికి దారేదిలోని ఫోక్ సాంగ్ ను పోలి ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తమన్ మళ్లీ కాపీ కొట్టాడుంటూ సెటైర్లు వేస్తున్నారు.
Translate this News: