Benefits of Surya Namaskar: ఆదిత్య ఎల్-1 (Aditya-L1) ప్రయోగంతో ఇండియా పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. చంద్రయాన్-3 సక్సెస్‌ని ఓవైపు ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని జరిపారు ఇస్రో సైంటిస్టులు. ఈరోజు ఉదయం 11.50 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదిత్య-ఎల్1 ఆర్బిటర్‌ను పీఎస్‌ఎల్‌వీ-సీ57.1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ను విజయవంతంగా ప్రయోగించిండంతో ఇస్రోని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అభినందించారు. మరోవైపు ప్రయోగానికి ముందు డూన్ యోగా పీత్‌లో పలువురు సూర్య నమస్కారాలు చేశారు. ఈ క్రమంలో సూర్య నమస్కారాలపై చర్చ జరుగుతోంది.
సూర్య నమస్కారం వల్ల ప్రయోజనాలేంటి?
➼ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
➼ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
➼ శరీరాన్ని, మనస్సును సమతుల్యం చేస్తుంది.
➼ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
➼ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
➼ గుండెను బలపరుస్తుంది.
➼ ఉదర కండరాలు, శ్వాసకోశ వ్యవస్థ, శోషరస వ్యవస్థ, వెన్నెముక నరాలు ఇతర అంతర్గత అవయవాలను ప్రేరేపిస్తుంది.
➼ వెన్నెముక, మెడ, భుజం, చేతులు, చేతులు, మణికట్టు, వీపు, కాలు కండరాలను టోన్ చేస్తుంది.
➼ శరీరం, శ్వాస, మనస్సు పరస్పర అనుసంధానాన్ని నియంత్రిస్తుంది.
➼ శక్తి స్థాయిలను పెంచుతుంది.
➼ సహజంగా నిద్రలేమిని నయం చేస్తుంది.
➼ చర్మ సంరక్షణ & జుట్టు సంరక్షణలో సహాయపడుతుంది.
➼ ఒత్తిడిని తగ్గిస్తుంది.
➼ అంతర్ దృష్టిని పెంచుతుంది.
పిల్లలకు ఎంతగానో ఉపయోగం:
చిన్నవయసులోనే ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నారు. సూర్య నమస్కారం పిల్లలు వారి మనస్సులను ప్రశాంతంగా ఉంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి, ఓర్పును పెంపొందించడానికి సహాయపడుతుంది . ఇది ముఖ్యంగా పరీక్షల సమయంలో ఆందోళన, విశ్రాంతి లేని అనుభూతిని తగ్గిస్తుంది. సూర్య నమస్కారాన్ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల శరీరానికి బలం, తేజస్సు లభిస్తుంది. ఇది కండరాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది . ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు కూడా ప్రతిరోజూ సూర్య నమస్కారాన్ని చేయవచ్చు. మరోవైపు ఆదిత్య ఎల్1 సూర్యుని కక్ష్యలోకి చేరుకోవడానికి 128 రోజులు పడుతుంది. ఈ మిషన్ ఇస్రో అత్యంత విశ్వసనీయమైన PSLV రాకెట్‌తో ప్రయోగించారు. ఇప్పటి వరకు అమెరికాతో సహా అనేక దేశాలు సూర్యుని అధ్యయనం కోసం ఉపగ్రహాలను పంపినప్పటికీ, ఇస్రో- ఆదిత్య ఎల్ వన్ దానికదే ప్రత్యేకమైనది.
ASLO READ: చరిత్ర సృష్టించిన ఇస్రో… గాల్లోకి దూసుకెళ్లిన ఆదిత్య L -1..!!