/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-27T182859.353-jpg.webp)
Thaman Copy Trolls: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer). భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.
Also Read: Deepthi Sunaina: మరో సారి ప్రేమలో పడ్డ దీప్తి సునైనా..? ఎవరో తెలుసా..?
అయితే నేడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగల్ "జరగండి జరగండి" సాంగ్ లిరికల్ వీడియోను (Jaragandi Jaragandi Song)రిలీజ్ చేశారు మేకర్స్. ఇక పాట లిరిక్స్, ట్యూన్ గురించి పక్కన పెడితే చరణ స్టైల్, గ్రెస్ స్టెప్పులు మాత్రం అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మళ్ళీ కాపీ కొట్టిన తమన్
ఇది ఇలా ఉంటే ఈ పాటకు సంబంధించి సోషల్ మీడియాలో మరో ప్రచారం జోరుగా సాగుతోంది. "జరగండి జరగండి" పాటను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాపీ కొట్టారంటూ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. మరి ఈ పాట ఏ సాంగ్ ట్యూన్ ను పోలి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలోని "సుర్రో.. సుర్రా" పాట ట్యూన్ ను పోలి ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు ఫ్యాన్స్. అయితే "సుర్రో.. సుర్రా" పాటను తమన్ గురువు మణిశర్మ కంపోజ్ చేశారు. దీంతో ఈ విషయాన్నీ గుర్తుచేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ట్రోల్ల్స్, కామెంట్స్ పక్కన పెడితే తమన్ క్రేజే వేరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా కొనసాగుతున్నారు. వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు.
What's happening#Jaragandi#JaragandiJaragandiSong#RamCharan#GameChaner #Thaman#Shankar#RC15pic.twitter.com/Jhc2XZDg1l
— TollywoodHub (@tollywoodhub8) March 27, 2024
This Song >>>>> #JaragandiJaragandiSong pic.twitter.com/LPyKzoWBBZ
— . (@_TarakTweets) March 27, 2024