PM MODI : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈమధ్యే అత్యంత అడ్వాన్స్ డ్ వెర్షన్ ఏఐ టూల్ జెమినిని అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇది పక్కాగా వేగవంతంగా ఫలితాలను అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురించి ఓ నెటిజన్ అడిగిన ఒక ప్రశ్నకు జెమిని చెప్పిన సమాధానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీంతో ఈ విషయంపై కేంద్రం సీరియస్ అయ్యింది.
ప్రధాన మంత్రి మోదీ ఫాసిస్టా ? అంటూ ఓ నెటిజన్ అడిగాడు. దానికి జెమిని ఏఐ అనుచిత సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ గురించి అడిగితే ..కచ్చితంగా స్పష్టంగా చెప్పలేమంటూ దాటవేత ధోరణిలో సమాధానం చెప్పింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్ గా మారింది. దీంతో జెమినిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గూగుల్ ఏఐ టూల్ పక్షపాత ధోరణిగా వ్యవహారిస్తుందంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఇది అక్కడితో ఆగిపోలేదు..కేంద్రం ద్రుష్టికి వచ్చింది. దీంతో ఈ విషయాన్నిమరింత సీరియస్ తీసుకుంది కేంద్రం. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇది ఐటీ చట్టం నిబంధనల ప్రత్యక్ష ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. క్రిమినల్ కోడ్ నిబంధనలకు కూడా ఉల్లంఘించినట్లే నంటూ హెచ్చరించారు. గతేడాది డిసెంబర్ లో గూగుల్ ఈ అడ్వాన్స్ డ్ వెర్షన్ ఏఐ మోడల్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టెక్ట్స్ , ఫొటో, వీడియో, ఆడియో, కోడింగ్ వంటి రకరకాల సమాచారాన్ని 90శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఈ మధ్య దీని వాడకంపై గూగుల్ యూజర్లకు కీలక సూచనలు చేసింది. ఈ ఏఐటూల్ ద్వారా సందేహాల పరిష్కారం చేసుకునే క్రమంలో లేదా సమాచారం తెలుసుకునే సమయంలో వ్యక్తిగత,సున్నితమైన డేటాను షేర్ చేయకూడదని సూచించింది.
ఇది కూడా చదవండి: వావ్..! సినిమాకు మించి రకుల్ వెడ్డింగ్ వీడియో.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే