/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-86.jpg)
Netizen Fires On Pusha 2 Makers : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ అవ్వడంతో పాటూ అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు ను కూడా తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ 'పుష్ప 2' కోసం సినీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. రీసెంట్ గా మ్యాజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ రిలీజ్ చేసిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.
ఆగస్టు 15 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. మరో రెండు నెలల్లో రిలీజ్ కావాల్సినా పుష్ప-2 ఊహించని విధంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమాన హీరో మూవీ వాయిదా పడడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఆ హీరోయిన్ వల్లే నాకు సినిమా ఛాన్సులు వస్తున్నాయి.. తాప్సి షాకింగ్ కామెంట్స్!
జోక్ లా ఉందా?
ట్విటర్ వేదికగా మూవీ టీమ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.తాజాగా అల్లు అర్జున్ ట్వీట్‌కు ఓ నెటిజన్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చాడు. " పుష్ప-2 సినిమా జూన్ 2024లో విడుదల కావాల్సిన సినిమా. అసలు డిసెంబర్ 2024కి ఎందుకు మార్చారు. ఇదంతా పుష్ప మేకర్స్‌కు జోక్‌లా ఉందా? మీరు ప్రేక్షకుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు. తక్షణమే పుష్ప-2 విడుదల చేయాలని కమ్యూనిటీ తరపున కోర్టులో కేసు వేస్తా" అంటూ ఐకాన్ స్టార్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
The movie was releasing in June 2024. Why this has been shifted to Dec 2024.
Is this a joke to the filmmakers. Playing with the emotions of audience.
On behalf of Puspha Community i will file a case in Court to release it ASAP
— GlobalGlimpses✨ (@krunchi_hu) June 17, 2024