World Cup 2023 :మొన్న ఇంగ్లండ్, నిన్న సౌత్ ఆఫ్రికా...పసికూనలు అదరగొడుతున్నాయి. వన్డే క్రికెట్ ప్రపంచకప్ నెమ్మదిగా ఇంట్రస్టింగ్ అవుతోంది. పసికూనలు అనుకుంటున్న టీమ్‌లు ఛాంపియన్‌లను మట్టి కరిపిస్తున్నాయి. మొన్న ఇంగ్లాండ్‌ను ఆఫ్ఘాన్ మట్టి కరిపిస్తే నిన్న నెదర్లాండ్స్...సౌత్ ఆఫ్రికాకు షాక్ ఇచ్చింది. 38 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. By Manogna alamuru 18 Oct 2023 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి SA Vs Ned World Cup 2023: నెదర్లాండ్స్...చాలా చిన్న జట్టు. పెద్దగా ఎప్పుడూ ఆడింది లేదు. అసలు ఈ టీమ్ ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌కు అర్హతనే సాధించలేదు. కానీ నిన్నటి మ్యాచ్‌లో మాత్రం అదర్లాండ్స్ అనిపించింది. మంచి ఫామ్‌లో ఉండి, టైటిల్ ఫేవరెట్ల జట్లలో ఉన్న సౌత్ ఆఫ్రికాను (South Africa) ఓడించి తమ ఖాతాలో చిరస్మరణ విజయాన్ని వేసుకుంది. నెదర్లాండ్స్ (Netherlands) కు ఈ టోర్నీలో ఇదే మొదటి గెలుపు. ఓవరాల్‌గా ప్రపంచకప్‌లలో అయితే మూడోది. సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్‌కు నిన్న ఢిల్లీలో మ్యాచ్ జరిగింది. వర్ణం కారణంగా మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. డచ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఆ టీమ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్ (Scott Edwards) 78 పరుగులు చేయడంతో 43 ఓవర్లలో నెదర్లాండ్స్ 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. సఫారీ టీమ్‌లో ఇంగిడి, మార్కో జన్సెన్, రబాడ చెరో 2 వికెట్లు తీసుకోగా...కొయెట్జీ, కేశవ్ మహరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. Also Read: గాజా ఆసుపత్రిలో పేలిన బాంబు, 500మంది మృతి తర్వాత 246 పరుగుల లక్ష్య ఛేదనతో సౌత్ ఆఫ్రికా బరిలోకి దిగింది. అయితే నెదర్లాండ్స్ బౌలర్లు అందరూ రాణించడంతో సఫారీ జట్టు 42.5 ఓవర్లలో ఆల్ అవుట్ అయి 207 పరుగులు మాత్రమే చేసి ఓటమిని సొతంత చేసుకుంది. డచ్ టీమ్‌లో లొగాన్ వాన్ బీక్ 3/60 , పాల్ వాన్ బీక్ 2/40 , వాన్ డర్ మెర్వ్ 2/34 , బాస్ డీ లీడ్ 2/36, అకెర్‌మెన్ 1/16 వికెట్లు తీసి జట్టును విజయతీరాలకు చేర్చారు. View this post on Instagram A post shared by ICC (@icc) నెదర్లాండ్స్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం ఇదేమీ మొదటిసారి కాదు. 2020 టీ 20 వరల్డ్‌కప్‌లోనే (World Cup) సఫారీ టీమ్‌కు డచ్ టీమ్ షాకిచ్చింది. అప్పుడు కూడా 13 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను మట్టికరిపించింది. #netherlands #south-africa #icc-world-cup-2023 #sa-vs-ned మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి