Nellore: మాజీమంత్రి నారాయణకు అపూర్వ ఆదరణ

ఏపీలో టీడీపీకి రోజురోజుకు ఆదరణం పెరుగుతోంది. భవిష్యత్తుకు గ్యారంటీ ప్రోగ్రాంపై ప్రజలు ఎక్కువ ఆదరణం చూపిస్తున్నారు. ప్రజలు ఆదరణ చూసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని దీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.

New Update
AP High Court: మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట

గెలుపు ఖాయం

మాజీ మంత్రి నారాయణకు నీరాజనాలు పలుకుతున్నారు నెల్లూరు నగరవాసులు. నగర నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా ఆయన్ను కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నారు. రెండు రోజుల క్రితం 39వ డివిజన్‌లో పర్యటించిన ఆయనపై పూల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటన ఆద్యంతం ప్రజలు నారాయణ పట్ల ప్రత్యేక అభిమానం చాటుకున్నారు. తాజాగా ఆయన 47,49,50 డివిజన్లలో పర్యటించగా మళ్లీ అలాంటి ఆప్యాయ వాతావరణమే కనిపించింది. సాదరంగా ఆహ్వానం పలికిన ప్రజలు అపూర్వంగా ఆదరించారు. తేనీటితో ఆప్యాయంగా పలకరించి కష్టసుఖాలు పంచుకున్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ-ఇది చంద్రబాబు ష్యురిటీ కార్యక్రమం జరుగుతున్న తీరు తెలుకునే నేపథ్యంలో నారాయణ 47, 49, 50 డివిజన్లలో ఆకస్మికంగా పర్యటించారు.

భవిష్యత్తుకు గ్యారెంటీ

సర్వే జరుగుతున్న తీరుతెన్నులపై నారాయణ ఆరా తీశారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను వివరాలు కోరగా సానుకూలంగా స్పందించారు. పైపెచ్చు సర్వే కూడా చాలా బాగుందని తెలియజేసారు. సర్వేకి అన్నివిధాలుగా సహకరిస్తూన్నామని స్పష్టం చేసిన ప్రజలు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకుంటామని, పొంగూరు నారాయణను ఎమ్మెల్యే చేసుకుంటామని ఘంటాపథంగా చెప్తున్నారు. వైసీపీ వచ్చాక సమస్యలు పెరిగాయని, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టడం లేదని చెప్పుకొచ్చారు. భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రోగ్రాంపై సర్వే నిర్వహించి అగ్రస్థానంలో ఉన్న 47వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ధర్మవరం సుబ్బారావు, డివిజన్ ఇంచార్జ్ గణేష్‌ను నారాయణ ప్రత్యేకంగా అభినందించారు. నగరంలోని డివిజన్ల ఇంచార్జ్‌లు, కార్యకర్తలు సుబ్బారావుని ఆదర్శంగా తీసుకోవాలని నారాయణ సూచించారు.

తప్పుల్ని సరిదిద్దుకుంటూ

నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నారాయణ.. వచ్చే ఎన్నికల్లో ఎలగైన తన అదృష్టం మరోసారి పరీక్షించుకోతున్నారు. అయితే నెల్లూరులో ఈ పోటీలు చాలా బలంగా ఉన్నాయి. నారాయణ.. ప్రత్యర్థి అనిల్‌ కుమార్ మధ్య పోటీ గట్టిగానే ఉంది. గత ఎన్నికల్లో చేసిన తప్పులు ఈ సారి చేయకుంటా నానారాయణ దూకుడు పెంచారు. అయితే మంత్రి హోదాలో అతి విశ్వాసమే నారాయణ కొంప ముంచిందని స్థానిక నాయకులు అంటున్నారు. తప్పుల్ని సరిదిద్దుకుంటూ తమవైపు తిప్పుకుంటూ వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం రాజకీయం నారాయణ మొదలు పెట్టారు

Advertisment
Advertisment
తాజా కథనాలు