Heart Attacks : సాధారణంగా లిపిడ్ ప్రొఫైల్(Lipid Profile) పరీక్ష చేయించుకున్నప్పుడు కొలెస్ట్రాల్(Cholesterol) తో పాటు ట్రైగ్లిజరైడ్స్(Triglycerides) ని తెలుసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా భారతదేశం(India) లో గుండెపోటు(Heart Attack) కేసులు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు.. బలహీనమైన జీవనశైలి, కోవిడ్ వైరస్(Covid Virus) గుండె జబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. గుండె జబ్బులు పెరుగుతున్నందున ప్రజలు కూడా వాటిపై అవగాహన పెంచుకుంటున్నారు. ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు కొందరు లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకుంటున్నారు. కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కానీ కొందరు ఆ టెస్టులో ట్రైగ్లిజరైడ్స్‌పై దృష్టి పెట్టరు.
ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి..?
- మన శరీరంలోని ఒక రకమైన కొవ్వును ట్రైగ్లిజరైడ్స్ అని అంటారు. ప్రస్తుత కాలంలో చాలా మందికి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. చెడు ఆహారపు అలవాట్లు, కాలేయంలో ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా ట్రైగ్లిజరైడ్స్ స్థాయి పెరుగుతుంది.
అధిక ట్రైగ్లిజరైడ్స్ ప్రమాదకరమా..?
- కొలెస్ట్రాల్ లాగే ట్రైగ్లిజరైడ్స్ పెరగడం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. వీటి స్థాయి 200 దాటితే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొలెస్ట్రాల్ సాధారణంగా ఉన్నా ట్రైగ్లిజరైడ్స్ మాత్రం పెరుగుతాయి. ట్రైగ్లిజరైడ్స్ మాత్రమే పెరిగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ట్రైగ్లిజరైడ్స్ స్థాయి 200 దాటితే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. మంచి ఆహారం, వ్యాయామంతో దీన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:
- మీ ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
- ప్రాసెస్ చేసిన మాంసం, అధిక కొవ్వు పదార్థాలను తినడం మానుకోండి.
- ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి.
- ప్రతి మూడు నెలలకోసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి: స్కిన్ ఇన్ఫెక్షన్ చాలా ఇరిటేటింగ్.. ఇది బెటర్ రిలీఫ్ ఆప్షన్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.