Migraine: మైగ్రేన్ విషయంలో ఇవి గుర్తుంచుకోండి.. నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు చాలా మందిలో మైగ్రేన్ సమస్య వేధిస్తుంటుంది. మైగ్రేన్ తలనొప్పి ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టం. మంచి నిద్ర, విశ్రాంతి కూడా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజూ యోగా, వ్యాయామం చేయడం వల్ల మైగ్రేన్ నొప్పి తగ్గుతుంది. By Vijaya Nimma 19 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Migraine: ఆహారపు అలవాట్ల వల్ల మనుషుల్లో రోగాలు పెరుగుతున్నాయి. చాలా మందిలో మైగ్రేన్ సమస్య కనిపిస్తుంటుంది. మైగ్రేన్ అనేది ఒక రకమైన నొప్పి. ఇది తలలోని ఏ భాగానికైనా రావచ్చు. ఇంతకు ముందు ఈ వ్యాధి 45 ఏళ్లలోపు వారిలో వచ్చేది. కానీ ఇప్పుడు ఎవరికైనా వస్తోంది. మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పికి భిన్నంగా ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టం. మైగ్రేన్ లక్షణాలు: మైగ్రేన్ నొప్పి సాధారణ తలనొప్పికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ నొప్పి అకస్మాత్తుగా వస్తుంది. కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు ఈ నొప్పిని సాధారణ తలనొప్పిగా భావించి మందులు వేసుకుంటుంటారు. మైగ్రేన్ నొప్పి చాలా బాధాకరంగా ఉంటుంది. దీని లక్షణాల గురించి చెప్పాలంటే వాంతులు, అజీర్ణం, కళ్ల ముందు నల్లటి మచ్చలు కనిపించడం, బలహీనత, చిరాకుగా అనిపించడం జరుగుతుంటుంది. మైగ్రేన్ నుంచి ఇలా రక్షించుకోండి: మైగ్రేన్ సమస్య ఎవరికైనా రావచ్చు. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ నొప్పి చాలా కాలం పాటు ఉంటుంది. దీనికి కొన్ని సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. నొప్పి వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించి మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి. అంతేకాకుండా మంచి నిద్ర, విశ్రాంతి కూడా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మసాలా, కారంగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. రోజూ యోగా, వ్యాయామం చేయడం వల్ల కూడా మైగ్రేన్ నొప్పి తగ్గుతుంది. ఒత్తిడి, ఆందోళన చెందకూడదని గుర్తుంచుకోండి. అధిక ఒత్తిడి నొప్పిని పెంచుతుంది. ఎన్ని చేసినా నొప్పి తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఇది కూడా చదవండి: చియా విత్తనాలతో చర్మ సంరక్షణ.. ఇలా ఫేస్ మాస్క్ చేసుకోండి గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #migraine #best-helth-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి