నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ).. నీట్-యూజీ 2024 ఫైనల్ రివైజ్డ్ ఫలితాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయించిన ఆధారంగా ఈ మెరిట్ లిస్టును రిలీజ్ చేసింది. అంతకముందు ఈ పరీక్షకు సంబంధించి ఫైనల్ రివైజ్డ్ ఆన్సర్ కీని కూడా విడుదల చేసింది. విద్యార్థులు తమ రివైడ్డ్ ఫలితాలను exams.nta.ac.in/NEET వెబ్‌సైట్‌లో చూడొచ్చు. రివైజ్డ్ కీని https://nta.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
Also read: ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు
పరీక్ష అప్లికేషన్ నంబరు, పుట్టిన తేదీ, అభ్యర్థి ఈమెయిల్ లేదా ఫోన్ నంబర్ వివరాలను ఎంటర్ చేసి పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు. తాజాగా విడుదల చేసిన రివైజ్డ్ రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే.. 17 మంది అభ్యర్థులకే 1వ ర్యాంకు వచ్చింది. ఇదిలాఉండగా.. ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ -యూజీ పరీక్షను మొత్తం 24,06,079 మంది అభ్యర్థులు రాశారు. వీళ్లలో 10,29,154 మంది అబ్బాయిలు, 13,76,831 మంది అమ్మాయిలు, 18 మంది థర్డ్ జెండర్ వారు ఉన్నారు.
Also read: బెంగళూరులో ట్రాఫిక్.. కారులో కంటే నడుచుకుంటూ వెళ్తేనే బెస్ట్ !