NEET-UG: పరీక్ష ఫలితాలు విడుదల చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూలై 19 సాయంత్రం 5 గంటలలోపు విద్యార్థులు సాధించిన మార్కులను ప్రచురించాలని NTAను ఆదేశించింది. వెబ్ సైట్లో అభ్యర్థుల వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేసింది.

New Update
NEET-UG: పరీక్ష ఫలితాలు విడుదల చేయండి.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!

NEET-UG 2024: నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అధికారిక వెబ్ సైట్లో నగరాలు, సెంటర్ వారీగా అభ్యర్థుల వివరాలను గోప్యంగా ఉంచి రిజ్ట్స్ రిలీజ్ తెలిపింది. ఈమేరకు పేపర్ లీక్ కేసుకు సంబంధించిన తీర్పులో జూలై 19 సాయంత్రం 5 గంటలలోపు నీట్-UG 2024 పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కులను ప్రచురించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

నగరాలు, కేంద్రాల వారీగా అప్ లోడ్..
NEET-UG 2024 పరీక్ష ఫలితాలు అభ్యర్థుల గుర్తింపును చూపించకుండా ప్రచురించబడతాయి. నగరాలు, కేంద్రాల వారీగా అప్ లోడ్ చేస్తారని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక లీకేజీ అంశంపై జులై 22 సోమవారం మరోసారి విచారించనున్నట్లు తెలిపింది. 2024 మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ 2024 (NEET UG 2024) పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్‌ లీక్‌ అవడంతో నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్‌ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్‌ మార్కులు కలపడం, ఓఎంఆర్‌ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

Advertisment
తాజా కథనాలు