NEET UG 2024: నీట్ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షను క్యాన్సిల్ చేస్తే దానికున్న గౌరవం, పవిత్రత దెబ్బతింటాయని పేర్కొంది. దీనిపై NTA సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణ జులై 8కి వాయిదా వేసింది.

New Update
NEET UG 2024: నీట్ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

NEET UG 2024: నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయని, దీంతో ఎగ్జామ్ మళ్లీ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిన్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అమనుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ జరిపింది. పరీక్షను క్యాన్సిల్ చేయడం అంత సులువు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సమాధానం చెప్పాలని నోటీసులు(notice) జారీ చేసింది. సమాధానం వచ్చిన తర్వాత కేసు తదుపరి విచారణను జూలై 8న చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. అలాగే విచారణ సందర్భంగా ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కౌన్సిలింగ్‌ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

‘ఇది మీరు అనుకున్నంత సులభమైన పని కాదు. అలా చేస్తే పరీక్షకు ఉన్న గౌరవం, పవిత్రత దెబ్బతింటాయి. అందువల్ల ఈ ఆరోపణలపై మాకు సమాధానాలు కావాలి’ అని ధర్మాసనం పేర్కొంది. ఇక అనంతరం దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. ఆలోగా ఎన్‌టీఏ తమ సమాధానం తెలియజేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు