/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-7-13.jpg)
Neeraj Chopra- Arshad Nadeem : పారిస్ ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రో విభాగంలో టీమ్‌ఇండియా స్టార్ నీరజ్ చోప్రా రజతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అటు పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ బంగారు పతకం సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పుడీ ఇద్దరు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయారు.
ఈ క్రమంలోనే ఈ ఇద్దరి జీవితాల ఆధారంగా సినిమాలు తీస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. అయితే వీరి పాత్రలకు ఎవరు బాగా సూటవుతారు అనేది ప్రధాన ప్రశ్న. ఈ ప్రశ్నకు వీరిద్దరే సమాధానం చెప్పారు అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొదట నీరజ్ చోప్రా మాట్లాడుతూ.." నదీమ్ చాలా ఎత్తుగా ఉంటాడు. అతడి క్యారెక్టర్‌ను చేసే నటుడు కూడా అలానే ఉండాలి. భారత్‌లో అలాంటి నటుడు మన యంగ్ అమితాబ్ బచ్చన్. ఆయనైతేనే ఈ రోల్‌కు న్యాయం చేయగలడు’’ అని అన్నాడు.
King Khan 🤝 Neeraj Chopra!
Which Bollywood actor would you cast as Neeraj Chopra in his biopic?
Catch the closing ceremony of the Olympics tonight from 12:30 AM onwards, LIVE on #Sports18, and stream it FREE on #JioCinema 👈#OlympicsOnJioCinema #Javelin #Cheer4Bharat pic.twitter.com/RZ6ZD0K9so
— JioCinema (@JioCinema) August 11, 2024
Also Read : మరోసారి డీప్ ఫేక్ బారిన రష్మిక.. ఈసారి ఏకంగా అలాంటి వీడియోతో
ఇదే విషయంపై నదీమ్‌ను అడిగితే.. " నీరజ్ చోప్రా బయోపిక్ వస్తే అందరికీ స్ఫూర్తిగా ఉంటుంది. అతడు దీనికి అర్హుడు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అయితే బాగుంటుందనే నా అభిప్రాయం" అంటూ చెప్పాడు. మరి ఈ ఇద్దరి బయోపిక్స్ నిజంగా వస్తాయా? ఒకవేళ వస్తే వాటిని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.