Brand Deals: భారీగా పెరిగిన ఒలింపిక్ హీరోల ఆదాయం.. క్యూ కడుతున్న బడా కంపెనీలు!

పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత ఆటగాళ్ల ఆదాయం భారీగా పెరుగుతోంది. నీరజ్ చోప్రా ఆదాయం 40 నుంచి 50% పెరగగా మను భాకర్ ఆదాయం 6 నుంచి 7రెట్లు పెరిగింది. మను కోసం 40 కంపెనీలు పోటీపడుతున్నాయి. PR శ్రీజేష్, లక్ష్య సేన్, అర్జున్ బాబుటా ఆదాయం కూడా డబుల్ అయింది.

New Update
Brand Deals: భారీగా పెరిగిన ఒలింపిక్ హీరోల ఆదాయం.. క్యూ కడుతున్న బడా కంపెనీలు!

Brand Deals Business: భారత్ నుంచి పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటిన ఆటగాళ్ల ఆదాయం భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలు బడా కంపెనీలు తమ బ్రాండ్లను(Brand Deals) ప్రమోట్ చేయించేందుకు క్యూ కడుతున్నాయి. నీరజ్ చోప్రా, మనుభాకర్, హాకీ గోల్‌కీపర్‌ పిఆర్‌ శ్రీజేష్‌, షట్లర్‌ లక్ష్య సేన్‌, షూటర్‌ అర్జున్‌ బాబుటాకు భారీ ఆఫర్లు ఇస్తూ తమ ఉత్పత్తులను ప్రచారం చేయించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించనప్పటికీ నీరజ్ చోప్రా బ్రాండ్ విలువ 40 నుంచి 50% పెరగడం విశేషం.

ఒక్కో బ్రాండ్‌కు రూ.4 కోట్లు..
నీరజ్ ఒక్కో బ్రాండ్‌కు సంవత్సరానికి రూ.4 కోట్లు తీసుకుంటుండగా.. ప్రస్తుతం నీరజ్‌ నెట్‌ వర్త్‌ సుమారు రూ.37.6 కోట్లు. ఇప్పటికే నీరజ్ హై-ప్రొఫైల్ ఎండార్స్‌మెంట్స్, నీరజ్ స్విస్ లగ్జరీ వాచ్‌మేకర్ ఒమేగాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్‌తో పాటు ఎవరెడీ కంపెనీని ప్రమోట్ చేస్తున్నాడు. వీటితోపాటు లిమ్కా, బైజుస్, నైక్‌, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్, బ్రిటానియా, మొబిల్ ఇండియా వంటి 21 కేటగిరీల ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు నీరజ్ తాజాగా ఒప్పందం చేసుకున్నాడు. స్పోర్ట్స్ లైఫ్‌స్టైల్, ఆడియో అండ్ స్మార్ట్‌ఫోన్‌లతో సహా ఆటోమొబైల్స్ నుండి ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ వంటి మరిన్ని బ్రాండ్స్ నీరజ్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Murder Case : వీడని మిస్టరీ.. ఇంటర్ విద్యార్థి వాహీదును చంపిందెవరు?

ఏడు రెట్లు పెరిగిన మనుభాకర్ ఆదాయం..
ఇక పారిస్ ఒలింపిక్స్‌కు ముందు మను భాకర్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం 20-25 లక్షలు అందుకుంది. అయితే ఈ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మను భాకర్ ఆదాయం 6 నుంచి 7 రెట్లు పెరిగింది. మను భాకర్ తో 40 కంపెనీలు ఒప్పందం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఇప్పటీకే ఆమె కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక బ్రాండ్ డీల్ రూ.1.5 కోట్లకు ఒకే అయిందని, మరికొన్ని రోజుల్లో నీరజ్ చోప్రా బ్రాండ్ వాల్యూను మను భాకర్ అధిగమించే ఛాన్స్ ఉందని బిజినెస్ ఎక్ట్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఇక PR శ్రీజేష్, లక్ష్య సేన్, అర్జున్ బాబుటా వంటి ఇతర అథ్లెట్ల ఆదాయం కూడా డబుల్ అయింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు