Andhra Pradesh : ఏపీ కొత్త సిఎస్ గా నీరబ్ కుమార్..

ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్ కుమార్‌ నియమితులయ్యారు. గతంలో కూడా నీరబ్ చంద్రబాబు హయాంలో ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుత సీఎస్ సెలవుపై వెళ్ళడంతో కొత్త సీఎస్‌ను నియమించారు.

Andhra Pradesh : ఏపీ కొత్త సిఎస్ గా నీరబ్ కుమార్..
New Update

New CS For Andhra Pradesh : ఏపీ (AP) లో ప్రభుత్వం మారడంతో.. గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారుల్లో టెన్షన్ పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి సెలవు పై వెళ్ళారు. నిన్న చంద్రబాబుతో జవహర్ రెడ్డి భేటీ అయ్యారు. వ్యక్తిగత కారణాలతో సెలవు పై వెళుతున్నట్లు కాబోయే ముఖ్యమంత్రికి ఆయన తెలిపినట్లు సమాచారం. GAD పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ను ఈ మేరకు సీఎస్ లీవ్ కావాలని కోరినట్లు తెలస్తోంది. ఇదే నెలతో ప్రస్తుత సీఎస్‌ జవహర్‌రెడ్డి (CS Jawahar Reddy) పదవీ కాలం కూడా ముగియనుంది.

అయితే ఇప్పుడున్న సీఎస్ సెలవు మీద వెళ్ళిన కారణంగా ఏపీ గవర్నమెంట్ (AP Government) కొత్త సీఎస్‌ను నియమించింది. ఈ ప్లేస్‌లోకి ఇంతకు ముందు కె. విజయానంద్‌ను నియమిస్తారని కథనాలు వచ్చాయి. కానీ కొత్త సీఎస్‌గా 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్‌ (Neerabh Kumar) ను నియమించారు. మొదట నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబు ఈయననే సీఎస్‌గా నియమించడానికి మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు హయాంలో నీరబ్ కుమార్... కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఉంది. ఈయన ప్రస్తుతం అటవీ, పర్యావరణ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ గా పని చేస్తున్నారు. సీనియారిటీ వరుసలో అనంతరాములు, శ్రీలక్ష్మి, గోపాలకృష్ణ ద్వివేది, రజత్ భార్గవ్... పేర్లు కూడా పరిశీలనలో ఉన్నా.. నీరబ్‌నే కొత్త సీఎస్‌గా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

publive-image

Also Read:Telangana : ఈరోజు నుంచి ప్రజావాణి పునఃప్రారంభం.

#andhra-pradesh #chandrababu #new-cs #neerabh-kumar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe