ఉత్తరాఖండ్‌లో దారుణం.. నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి చిక్కుకున్న 40 మంది కూలీలు

ఉత్తరఖాండ్‌లోని ఉత్తర కాశీలోని నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కూలి 40 మంది కూలీలు అందులో చిక్కుకుపోయారు. సమాచారం మేరకు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతన్నాయి.

New Update
ఉత్తరాఖండ్‌లో దారుణం.. నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి చిక్కుకున్న 40 మంది కూలీలు

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కాశీలోని నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కూలి హఠాత్తుగా   40 మంది కూలీలు అందులో చిక్కుకున్నారు. యమునోత్రి జాతీయ రహదారిపై రోడ్డుపై ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రహదారి నిర్మాణాల్లో భాగంగా సిల్క్యారా నుంచి దండల్‌గావ్ వరకు సొరంగం నిర్మిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం సొరంగం నుంచి కార్మికులను బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రాణనష్టం గురించి ఇంకా ఎటువంటి సమాచారం అధికారులు చెబుతున్నారు.

Also Read: అయోధ్యలో సరికొత్త రికార్డు.. ఒకేసారి 22.23 లక్షల దీపాల వెలుగులు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు