Himanta Biswa Sarma: UCC అమలు చేయాలంటే 400 సీట్లు గెలవాలని.. సీఎం హిమంత బిస్వా కీలక వ్యాఖ్యలు

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలు చేయడానికి, మథురలోని కృష్ణ జన్మస్థాన్‌లో గొప్ప ఆలయాన్ని నిర్మించడానికి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలవాలని అస్సాం సీఎం బిస్వా శర్మ అన్నారు. బీజేపీ మతపరమైన రాజకీయాలకు వ్యతిరేకమని తేల్చి చెప్పారు.

New Update
Himanta Biswa Sarma: UCC అమలు చేయాలంటే 400 సీట్లు గెలవాలని.. సీఎం హిమంత బిస్వా కీలక వ్యాఖ్యలు

Himanta Biswa Sarma: బెగుసరాయ్‌లో సీనియర్ బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు మద్దతుగా ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) పై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న ప్రచారంపై విమర్శల దాడికి దిగారు. "కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాలేదు. రాహుల్ గానీ, లాలూ గానీ అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించడానికి వీల్లేదని నేను స్పష్టంగా చెబుతున్నాను." అని పేర్కొంన్నారు.

ALSO READ: సీఎం కేజ్రీవాల్, ఇండియా కూటమి భయపడింది.. జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు

కర్నాటక, ఇతర రాష్ట్రాలలో OBCలు/STలు, SCల రిజర్వేషన్ల కోటాను తగ్గించి కాంగ్రెస్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిందని అన్నారు. ఇప్పుడు దీనిని దేశవ్యాప్తంగా పునరావృతం చేయాలని కాంగ్రెస్ చూస్తోందని పేర్కొన్నారు. మమతా బెనర్జీ... ఓబీసీలకు కాంగ్రెస్, ఆర్జేడీలే పెద్ద శత్రువు... భారత్‌లో కాకుండా పాకిస్థాన్‌లో ముస్లింలకు మత ఆధారిత రిజర్వేషన్లు కల్పించాలని చురకలు అంటించారు. మతపరమైన రిజ్వేషన్లను ఎన్డీయే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు.

'UCC అంటే మతం ఆధారంగా లేని దేశంలోని పౌరులందరికీ ఉమ్మడి చట్టాన్ని కలిగి ఉండటం. వారసత్వం, దత్తత, వారసత్వానికి సంబంధించిన వ్యక్తిగత చట్టాలు, వారసత్వానికి సంబంధించిన చట్టాలు సాధారణ కోడ్ ద్వారా కవర్ చేయబడే అవకాశం ఉంది.' అని పేర్కొన్నారు. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలు చేయడానికి, మథురలోని కృష్ణ జన్మస్థాన్‌లో గొప్ప ఆలయాన్ని నిర్మించడానికి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలవాలని బిస్వా శర్మ అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు