/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-25.jpg)
NDA : దేశవ్యాప్తంగా లోక్ సభ, పలు రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల (Lok Sabha - Assembly Elections) పోలింగ్ (Polling) ముగియగానే ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) తమ తమ సర్వేలు వెల్లడించాయి. ఈసారి కూడా కేంద్రంలో ఎన్‌డీఏ సర్కార్ రాబోతుందంటూ చాలా సర్వేలు వెల్లడించాయి. ఎన్‌డీఏకు 330-400 వరకూ సీట్లు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ ఇండియా కూటమి 140-150 లోపే పరిమితమవుతుందని అంచనా వేస్తు్న్నాయి. ముఖ్యంగా ఎన్‌డీఏకు 400 పైగా సీట్లు వస్తాయని రెండు సంస్థలు ఇండియా టీవీ - CNX, న్యూస్ 24 - టుడేస్ చాణక్య చెబుతున్నాయి. దేశంలో ఇప్పటివరకూ 1984లో మాత్రమే కాంగ్రెస్‌కు సొంతంగా 404 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత మరే పార్టీకి సాధ్యం కాని 400 మార్క్ ఈసారి మోడీ హయాంలో రాబోతున్నయని బలంగా నమ్ముతున్నాయి. వీటితోపాటు చాలా సర్వేలు కేంద్రంలో మరోసారి ఎన్డీఏ వైపే మొగ్గు చూపుతున్నాయి. పోల్ ఆఫ్ ది పోల్‌లో ఎన్డీఏ కూటమికి 369 వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. పోల్ ఆఫ్ ది పోల్‌లో ఇండియా కూటమికి 157 రావొచ్చని పేర్కొంది.
Also Read : Exit Poll 2024: తెలంగాణలో లెక్కలు తలకిందులు.. ఇండియా టుడే సంచలన సర్వే!