మణిపూర్ లో బీజేపీకి షాక్.... పోలీసులు, అసోం రైఫిల్స్ జవాన్ల మధ్య మళ్లీ వాగ్వాదం....!

మణిపూర్ లో బీజేపీ సర్కార్ కు షాక్ తగిలింది. బీరేన్ సింగ్ సర్కార్ కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు కూకీ పీపు్ల్స్ అలయన్స్(కేపీఏ) తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అనుసూయ ఉయికేకు కేపీఏ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. కేపీఏకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.

author-image
By G Ramu
మణిపూర్ లో బీజేపీకి షాక్.... పోలీసులు, అసోం రైఫిల్స్ జవాన్ల మధ్య మళ్లీ వాగ్వాదం....!
New Update

మణిపూర్ లో బీజేపీ సర్కార్ కు షాక్ తగిలింది. బీరేన్ సింగ్ సర్కార్ కు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు కూకీ పీపు్ల్స్ అలయన్స్(కేపీఏ) తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అనుసూయ ఉయికేకు కేపీఏ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. కేపీఏకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.

కేపీఏ మద్దతు ఉపసంహరణతో బీరేన్ సింగ్ సర్కార్ కు పెద్దగా సమస్య ఏమి ఉండకపోవచ్చు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత బీరెన్ సింగ్ నేతృత్వంలోని మణిపూర్ సర్కార్ కు మద్దతు పలకడం సరికాదని తాము భావిస్తున్నట్టు కేపీఏ చీఫ్ టోంగ్ మాంగ్ హాకీఫ్ లేఖలో వెల్లడించారు.

అందుకే మణిపూర్ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇక నుంచి బీరేన్ సర్కార్ కు తమ మద్దతు ఉండబోదన్నారు. మరోవైపు మణిపూర్‌ పోలీసులు, అసోం రైఫిల్స్ మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది.

కుకీ మిలిటెంట్లతో అసోం రైఫిల్స్ జవాన్లు కుమ్మక్కయ్యారని, మిలిటెంట్లకు జవాన్లు సహకరిస్తున్నారని మణిపూర్ పోలీసులు ఆరోపించారు. బిష్ణుపూర్ లో అల్లర్లను అదుపు చేసేందుకు తమను అనుమతించడం లేదని అసోం రైఫిల్స్ జవాన్లపై మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

#bjp #manipur #nda #biren-singh #kpa #kuki-peoples-alliance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe