ప్రధాని మోదీ నివాసంలో ఈరోజు NDA సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ కొనసాగింది. ఎన్డీయేకు పూర్తిగా మద్దతిస్తామని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. అయితే జూన్ 7న మరోసారి ఎన్డీయే కూటమి సమావేశం కానుంది. దీంతో శుక్రవారం నాడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అదే రోజున ఎన్డీయే నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు.
Also Read: అవమానం నుంచి అద్భుత విజయం వరకూ.. చంద్రబాబు అలుపెరుగని పోరాటమిదే!
ఇదిలాఉండగా.. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో బీజేపీతో పాటు 15 పార్టీలు ఉన్నాయి. అయితే కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవుల కోసం.. మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కీలక పదవులను తెలుగుదేశం, జేడీయూ పార్టీలు ఆశీస్తున్నట్లు తెలుస్తోంది. రైల్వేశాఖ, షిప్పింగ్, ఐటీ, విమానయాన, ఉపరితల రవాణాశాఖ, మానవ వనరుల శాఖలపై మిత్రపక్షాల పట్టుపట్టినట్లు సమాచారం.
Also Read: విశాఖలో టైకూన్ జంక్షన్ తొలగింపు!