NBK109 : అబ్బాయి ప్లేస్ లో బాబాయ్ సినిమా.. 'NBK109' నుంచి మాస్ అప్డేట్!

బాలయ్య లేటెస్ట్ మూవీ 'NBK109' నుంచో అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ను అక్టోబర్‌ 10న విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట. ఇటీవలే బాలయ్య ఈ సినిమా సెట్‌లోకి ఎంటరయ్యారు. ఓ నెలన్నర షూటింగ్‌తో మొత్తం పూర్తవుతుందట.

NBK109 : అబ్బాయి ప్లేస్ లో బాబాయ్ సినిమా.. 'NBK109' నుంచి మాస్ అప్డేట్!
New Update

NBK 109 Release Update : నందమూరి నటసింహం బాలయ్య (Nandamuri Balakrishna) వరుస హిట్లతో ఊపు మీద ఉన్నారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇదే జోష్ తో మరో బ్లాక్ బస్టర్ కాంబోను లైన్ లో పెట్టారు బాలయ్య. బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ 'NBK 109'. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన పోస్టర్, ప్రమోషనల్ కంటెంట్ మూవీ అంచనాలను పెంచుతున్నాయి. ఇటీవలే రిలీజ్ చేసిన బాలయ్య బర్త్ డే గ్లింప్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ కోసం ఓ అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది.

Also Read : అవయవ దానం చేసిన విశ్వక్ సేన్.. రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

అక్టోబర్ 10 రిలీజ్...

ఏపీ ఎన్నికల (AP Elections) కారణంగా కొన్ని నెలలు ఈ సినిమా షూటింగ్‌కి విరామం ఇచ్చిన బాలకృష్ణ.. ఎట్టకేలకు మళ్లీ ఈ సినిమా సెట్‌లోకి ఎంటరయ్యారు. ఓ నెలన్నర షూటింగ్‌తో టాకీ పార్ట్‌ మొత్తం పూర్తవుతుందని సమచారం. దీంతో ఈ సినిమాను అక్టోబర్‌ 10న విడుదల చేయడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట. నిజానికి ఇదే డేట్ కి ఎన్టీఆర్ 'దేవర' (Devara) రిలీజ్ కావాల్సింది. కానీ ఆ సినిమా షూటింగ్ పనులు అనుకున్న దానికంటే ముందే కంప్లీట్ అవ్వడంతో సెప్టెంబర్ 27 కి ప్రీ పోన్ చేశారు. దీంతో ఆ డేట్ పై 'NBK109' మూవీ టీమ్ కన్నేసింది. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్టు తెలుస్తోంది.

#jr-ntr #nbk109-release-date #balakrishna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి