యువ హీరోకి అక్కగా నయనతార.. భలే ఛాన్స్‌ కొట్టేసిన డైరెక్టర్‌!

తమిళ నటుడు ప్రదీప్‌ రంగనాథన్ కి అక్కగా నటి నయనతార నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనుంది. దీనిని నయన్ భర్త విగ్నేష్‌ శివన్‌ నిర్మిస్తున్నారు.

యువ హీరోకి అక్కగా నయనతార.. భలే ఛాన్స్‌ కొట్టేసిన డైరెక్టర్‌!
New Update

Nayanthara : నయనతార (Nayanthara) ఓ యంగ్‌ హీరోకి అక్కగా నటిస్తుంది. తమిళ సూపర్‌ టాలెంటెడ్ నటుడు కమ్‌ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్‌ గురించి అందరికీ తెలిసిందే. కోమాలి (Comali) సినిమాతో దర్శకునిగా పరిచయమైన ప్రదీప్‌ ఆ తరువాత లవ్‌ టుడే సినిమా తీసి సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంది.

దీంతో ప్రదీప్‌ క్రేజ్‌ ఒక్కసారిగా బాగా పెరిగింది. అందుకే ఆయన చేస్తున్న సినిమాల పై మంచి అంచనాలు ఉంటున్నాయి. తాజాగా ప్రదీప్ మరో సినిమాకి ఒకే చెప్పారు. అయితే అది దర్శకునిగా కాదు...నటుడిగా. ఈ సినిమాని నయన్‌ భర్త విగ్నేష్‌ శివన్‌ తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అతి త్వరలోనే ఈ సినిమా మొదలు కానుంది. ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉంది. అది ఏంటంటే..ఇందులో ప్రదీప్‌ అక్కగా నయన్‌ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ కొత్త సినిమా పై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఈ సినిమాకి అనిరుధ్‌ మ్యూజిక్‌ ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం విగ్నేష్ తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తో ఒక సినిమా చేయనున్నారు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే నయనతార, ప్రదీప్ రంగనాథన్ సినిమా మొదలుకానుంది.

Also read: పోలీసులపై కన్నెర్ర చేసిన కౌశిక్‌రెడ్డి.. సీరియస్ యాక్షన్ తీసుకున్న సీపీ.!

#anirudh #vignesh-shivan #nayanthara
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి