NVS JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,377 ఉద్యోగాలపై కీలక అప్డేట్!

నిరుద్యోగులకు నవోదయ విద్యాలయ సమితి మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. 1,377 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తుల గడువును పొడగించింది. మే 7తో అప్లికేషన్ తేదీ ముగియగా మరోసారి మే 14వరకు అవకాశం కల్పిచింది. పూర్తి వివరాలకోసం ఈ ఆర్టికల్ చదవండి.

NVS JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,377 ఉద్యోగాలపై కీలక అప్డేట్!
New Update

NVS: దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా అప్లికేషన్ డేట్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ ఇచ్చింది నవోదయ విద్యాలయ సమితి. ఈ మేరకు ఏప్రిల్‌ 30న దరఖాస్తుల ప్రక్రియ మొదలవగా మే 7తో ముగిసింది. అయితే ఆన్ లైన్ ఇబ్బందులు, తదితర కారణాల రిత్యా మరోసారి దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు తెలిపింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,377 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా.. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఉద్యోగ ఖాళీల వివరాలివే:
ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులు- 121
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 5
ఆడిట్‌ అసిస్టెంట్ -12
జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ - 4
లీగల్ అసిస్టెంట్- 1
స్టెనోగ్రాఫర్- 23
కంప్యూటర్ ఆపరేటర్‌ - 2
క్యాటరింగ్ సూపర్‌వైజర్ - 78
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్- 381
ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్- 128
ల్యాబ్ అటెండెంట్ - 161
మెస్ హెల్పర్ - 442
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 19

అర్హత:
పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం:
రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.

ఇది కూడా చదవండి; Impact player: ఐపీఎల్ నుంచి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఔట్.. ఆల్ రౌండర్లకు శాపంగా మారడంతో!

దరఖాస్తు ఫీజు:
జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1500 (ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులకు) రూ.1000 (ఇతర పోస్టులకు). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500.

భారీ వేతనాలు..
పోస్టుల వారీగా వేతనాలు అందించనున్నారు. ఫిమేల్‌ స్టాఫ్‌ నర్స్‌ (లెవెల్‌-7) వేతనం రూ.44,900 - రూ.1,42,400 కాగా; అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, ఆడిట్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ ట్రాన్సిలేషన్‌ ఆఫీసర్‌, లీగల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.35,400-1,12,400; స్టెనోగ్రాఫర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, క్యాటరింగ్‌ సూపర్‌వైజర్‌, రూ.25,500-81,100; జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(హెచ్‌క్యూ/ఆర్‌వో క్యాడర్‌), జూనియర్‌ సెక్రటేరియట్‌ (జేఎన్‌వీ క్యాడర్‌), ఎలక్ట్రీషియన్‌ కమ్‌ ప్లంబర్‌ రూ.19,900-63,200, ల్యాబ్‌ అటెండెంట్‌, మెస్‌ హెల్పర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ కొలువులకు రూ.18,000-56,900 చొప్పున అందించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..
హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.

#navodaya-vidyalaya-samiti #applications-date-extended
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe