Navodaya Recruitment: నిరుద్యోగులకు అలెర్ట్.. నవోదయ విద్యాలయలో 1,377 పోస్టులకు నోటిఫికేషన్!

NVS 1,377 నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ సంస్థ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఫిమేల్ స్టాఫ్ నర్స్, మెస్ హెల్పర్, MTS మొదలైన వివిధ పోస్టుల కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన రిక్రూట్ చేస్తోంది.పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Navodaya Recruitment: నిరుద్యోగులకు అలెర్ట్.. నవోదయ విద్యాలయలో 1,377 పోస్టులకు నోటిఫికేషన్!
New Update

నవోదయ విద్యాలయ సమితి సుమారు 1,400 నాన్ టీచింగ్ పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ఏ అభ్యర్థి అయినా అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.in ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను పూరించి దాన్ని సబ్మిట్ చేయాలి. అభ్యర్థులు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు. మే 2న కరెక్షన్‌ విండో ఓపెన్‌ అవుతుంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం మే 2,3,4 వరకు మూడు రోజుల పాటు NVS దరఖాస్తు ఫారమ్‌కు కరెక్షన్‌ విండోను ఓపెన్ చేస్తారు. ఎన్‌వీఎస్‌(NVS) అడ్మిట్ కార్డ్, పరీక్ష తేదీని ఎన్‌టీఏ తన అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో ప్రకటిస్తుంది.

మొత్తం పోస్ట్‌లు:
NVS రిక్రూట్‌మెంట్ డ్రైవ్ స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (HQ/RQ కేడర్), మెస్ హెల్పర్, ల్యాబ్ అటెండెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్ లాంటి మొత్తం 1,377 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో ఇచ్చిన ఇమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ తమదేనని అభ్యర్థులు నిర్ధారించుకోవాలని సూచించారు. NTA నుంచి సమాచారం రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా పంపుతున్నట్టు అధికారిక నోటీసులో పేర్కొన్నారు.

ఖాళీ వివరాలు:

--> మహిళా స్టాఫ్ నర్స్: 121 పోస్టులు

--> అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5 పోస్టులు

--> ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు

--> జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 4 పోస్టులు

--> లీగల్ అసిస్టెంట్: 1 పోస్ట్

--> స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు

--> కంప్యూటర్ ఆపరేటర్: 2 పోస్టులు

--> క్యాటరింగ్ సూపర్‌వైజర్: 78 పోస్టులు

--> జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381 పోస్టులు

--> ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు

--> ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు

--> మెస్ హెల్పర్: 442 పోస్ట్‌లు

-->MTS: 19 పోస్టులు

NVS రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు ఎవరైనా అభ్యర్థులు ఇబ్బందిని ఎదుర్కొంటే.. 011 – 40759000/011 – 69227700 (హెల్ప్‌ లైన్‌ నంబర్స్‌) లేదా nvsre.nt@nta.ac.in ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు NVS నాన్-టీచింగ్ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి క్రింద ఇవ్వబడిన దశలను అనుసరించవచ్చు:

--> NTA exams.nta.ac.in/NVS/ లేదా navodaya.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.

--> హోమ్ పేజీలో 'రిజిస్ట్రేషన్/లాగిన్' ట్యాబ్‌ను చూడండి.

--> కొత్త విండో ఓపెన్ అవుతుంది. నమోదు ప్రక్రియను పూర్తి చేయండి.

--> రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో రూపొందించబడిన ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయండి.

--> దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి, చెల్లింపు చేయండి.

--> కాపీని డౌన్‌లోడ్ చేయండి, భవిష్యత్తు సూచన కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.

Also Read: SSC అభ్యర్థులకు అలెర్ట్‌.. CHSL ఎగ్జామ్‌పై కీలక అప్‌డేట్!

#latest-jobs #navodaya
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe