Tirumala: తిరుమలలో ప్రారంభమైన నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. స్వాగత తోరణాలతో ఆహ్వానం!

తిరుమలలో 9 రోజుల పాటు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో అక్టోబరు 19న గరుడ వాహన సేవ, అక్టోబర్ 20న పుష్పక విమానం, అక్టోబర్ 22న స్వర్ణ రథోత్సవం, అక్టోబర్ 23న చక్రస్నాన మహోత్సవం సహా పలు విశిష్ట కార్యక్రమాలు ఉంటాయి. 19 సాయంత్రం 6:30కు శ్రీవారి గరుడోత్సవం జరగనుంది.

Tirumala News: జూన్ 18న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
New Update

తిరుమల(Title)లో బ్రహ్మోత్సవాలు(brahmotsavam) ప్రారంభం అయ్యాయి. గత నెలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగగా, నేటి నుంచి నవరాత్రి(Navaratri) బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తిరుపతి కొండపై మూడేళ్లకు ఒకసారి రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 9 రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నిన్న సాయంత్రం తిరుపతి కొండపై బ్రహ్మోత్సవాల ముందస్తు కార్యక్రమం అంగురార్పణం జరిగింది. మరోవైపు ప్రస్తుతం దశస సెలవులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో టీటీడీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈనెల 23 వరకు శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షిస్తారు.

నవరాత్రి బ్రహ్మోత్సవాలలో అక్టోబరు 19న గరుడ వాహన సేవ, అక్టోబర్ 20న పుష్పక విమానం, అక్టోబర్ 22న స్వర్ణ రథోత్సవం, అక్టోబర్ 23న చక్రస్నాన మహోత్సవం సహా పలు విశిష్ట కార్యక్రమాలు ఉంటాయి. ఈనెల 19 సాయంత్రం 6:30కు శ్రీవారి గరుడోత్సవం జరగనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. ఇక ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. రెండో బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణం కార్యక్రమాలు నిర్వహించడంలేదు. అటు యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. అన్ని రకాల ప్రత్యేక, స్పెషల్‌ దర్శనాలను రద్దు చేసి అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల్లో 'సర్వ దర్శనం' మాత్రమే అనుమతించనున్నారు.

తమిళనాడు నుంచి ప్రత్యేక బస్సులు:
బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లే రద్దీని నియంత్రించేందుకు తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అక్టోబర్ 26 వరకు చెన్నై, తిరుచ్చి, తంజావూరు, సేలం, కోయంబత్తూర్, మధురై, కరైకుడి, పాండిచ్చేరి నుంచి తిరుపతికి ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా ఉంటే.. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు ముందుగా అంకురార్పణం నిర్వహిస్తారు.

ALSO READ: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌!

#tirumala #sarannavaratri
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe