Navaratri: అమ్మ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు.. నేటి నుంచి దేవీ శరన్నవరాత్రులు..!
ఇవాళ్టి(అక్టోబర్ 15) నుంచి దేవీ శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి. ఇవి దసరాతో అంటే అక్టోబర్ 24 వరకు కొనసాగుతాయి. ఆశ్వయుజ శుద్ధ ప్యాఢమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రి.. పదో రోజు విజయదశమి, దసరా అంటారు. విజయవాడలో దుర్గమ్మను తొలిరోజు శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించారు.